NTV Telugu Site icon

Rishabh Pant: జీవితం విలువ తెలిసింది.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా

Rishabh On Recovery

Rishabh On Recovery

Rishabh Pant Shares His Recovery Experience: గతేడాది డిసెంబర్ 30వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఈ ప్రమాదం తర్వాత తనకు జీవితం విలువ తెలిసిందని, చేసే ప్రతీ చిన్న పనిలోనూ ఆనందాన్ని వెతుక్కుంటున్నానని చెప్పాడు. జీవితాన్ని భిన్నమైన కోణంలో చూస్తున్నానని తెలిపాడు. బ్రష్ చేయడం, ఉదయాన్నే ఎండకు కూర్చోవడం వంటి పనులు.. తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయన్నాడు. గాయాల నుంచి త్వరగా కోలుకుంటున్నానని, రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తానని, అయితే కచ్ఛితమైన సమయాన్ని చెప్పలేనన్నాడు. భగవంతుడి దయ, డాక్టర్ల సహకారంతో.. త్వరలోనే మామూలు మనిషిని అవుతానని చెప్పాడు.

Student Sathvik: కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్మ.. ఆ టార్చరే కారణం

రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రమాదం తర్వాత జీవితం విషయంలో నా దృష్టికోణం మారింది. సాధారణంగా మనం పట్టించుకోని దైనందిన కార్యకలాపాలను సైతం ఆస్వాదిస్తున్నాను. ఈరోజుల్లో.. ఏదో సాధించాలన్న తపనతో, మనకు సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాల్ని విస్మరిస్తున్నాం. ఈ యాక్సిడెంట్ తర్వాత నేను వాటిని ఆస్వాదించగలుగుతున్నా’’ అని చెప్పుకొచ్చాడు. తాను ప్రతిరోజూ ఫిజియోథెరపి సెషన్‌లో పాల్గొంటున్నానని.. ఆ తర్వాత సెకండ్ సెషన్‌కు సిద్దమవుతున్నానని చెప్పాడు. సాయంత్రం చివరి సెషన్‌తో రోజును ముగిస్తున్నాని తెలిపాడు. సమయానికి పండ్లు, పానీయాలు తీసుకుంటున్నానని.. తాను పూర్తిగా కోలుకునేదాకా ఈ విధానం కొనసాగుతుందని పేర్కొన్నాడు. తాను వేగంగా కోలుకోవాలని ఎంతోమంది మెసేజ్‌లు చేశారని, వారందరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. ఇంతమంది శ్రేయోభిలాషులు, అభిమానులు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. క్రికెట్‌కు దూరమైనందుకు వెలితిగా ఉందని, తిరిగి క్రికెట్ ఆడాలని తహతహలాడుతున్నానని రిషభ్ పంత్ వెల్లడించాడు.

Amit Shah: తెలంగాణపైనే నా ఫోకస్.. కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి