Site icon NTV Telugu

Rinku Singh Engagement: నేడు ఎంపీ ప్రియ సరోజ్ తో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్..

Rinku

Rinku

Rinku Singh Engagement: భారత క్రికెటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను రింకూ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దని నిశ్చితార్థం ఈరోజు (జూన్ 8న) జ‌ర‌గ‌నుంది. వీరి ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హాటల్‌లో జరగనుంది. అలాగే, రింకూ సింగ్, ప్రియా సరోజ్ నవంబర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18వ తేదీన హోటల్ తాజ్‌లో గ్రాండ్‌గా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: Fish Prasadam: మృగశిర కార్తె రోజే చేపమందు ప్రసాదం ఎందుకు పంపిణీ చేస్తారు..?

కాగా, ఈ నిశ్చితార్థం వేడుక దాదాపు 300 మంది అతిధుల సమక్షంలో రింకు సింగ్, ప్రియా సరోజ్ జరగబోతున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట ప్రాంతంలో.. వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. పేదరికంలో ఉన్న రింకు సింగ్.. ఓ ఎంపీని పెళ్లి చేసుకోవడం చాలా గ్రేట్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ రాసుకొస్తున్నారు.

Exit mobile version