మన ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మారే ఆటకు ఉండదు. అందులో మన దేశంలో దానికి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇక ఐసీసీకి కూడా ఆదాయం వచ్చేది అంటే మన బీసీసీఐ నుండే. అటువంటి మన ఇండియా ఈ మధ్య యూఏఈ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేదు. దాంతో జట్టులోని ఆటగాళ్ళని మార్చాలని చాలా వాదనలు వచ్చాయి. అయితే వాటిపైన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఇండియాలో యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. కాబట్టి జట్టు విఫలం అయిన సమయంలో వారికీ అవకాశం ఇవ్వాలని వాదనలు వస్తుంటాయి. కానీ వారి కోసం జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్లను తీసేయలేరు. ఇప్పటికే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కాబట్టి అందరిని ఒకేసారి జట్టులోకి తేలేరు. కానీ ఇండియాలో టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. ఒక్కో స్థానానికి పోటీ బాగా ఉంటుంది. కాబట్టే ఒక్క మ్యాచ్ లో విఫలం కావడంతో మరొకరికి అవకాశం ఇవ్వాలని అని వాదనలు వస్తుంటాయి అని పాంటింగ్ అన్నారు.
ఇండియాలో టాలెంట్ ఎక్కువ.. అందుకే ఆ వాదనలు…!
