NTV Telugu Site icon

Rcb vs Csk : ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్.. మహేశ్ బాబు ఫ్యాన్స్ రచ్చ రచ్చ

Rcb Supports

Rcb Supports

క్రికెట్, సినిమాకు విడదీయని బంధం ఉంది. ఇదే ఫార్ములాతో అభిమానులకు ముందుకు వచ్చిన ఐపీఎల్.. 16సీజన్లుగా అలరిస్తూనే ఉంది. ఐపీఎల్ ఆరంభంలో ప్రతీ ఫ్రాంఛైజీకి సినిమా తారాలు ప్రచారకర్తలుగా.. సహా యజమానులుగా వ్యవహరించారు. ఆ తర్వాత కొందరు దూరమైన.. క్యాష్ రిచ్ లీగ్ లో సినీ తారాల సందడి మాత్రం తగ్గడం లేదు. కేకేఆర్ సహా యజమానిగా షారూఖ్ ఖాన్ ప్రత్యేక్షంగా మ్యాచ్ లకు హాజరువుతూ తమ జట్టుకు మద్దతు తెలుపుతుండగా.. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ దగ్గుబాటి సన్ రైజర్స్ టీమ్ కు ప్రతీ మ్యాచ్ కు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే క్రికెటర్లు, సినీతారాల కామన్ ఫ్యాన్స్ మైడానాల్లోో రచ్చ ర్చ చేస్తుంటారు.

Read Also : CSK vs RCB: దంచికొట్టిన చెన్నై బ్యాటర్స్.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం

అయితే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు ముందు ఇదే ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహేశ్ బాబును అభిమానించే వీరు.. చిన్నస్వామి స్టేడియం ముందు విరాట్-మహేశ్ బాబు పోస్టర్లతోహల్ చల్ చేశారు. మైదానానికి వెళ్లే ముందు జై బాబు.. మహేశ్ బాబు అంటూ నినాదాలు చేశారు. ఇందరు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్.. కాగా మహేశ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఇన్సింగ్స్ లో 226 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో భారీ లక్ష్యా్న్ని నిర్ధేశించారు. డేవాన్ కాన్వే ( 83 ), శివమ్ దూబే ( 52 ) అద్భుతమైన అర్థ సెంచరీలతో చెలరేగిపోయారు. రహనే (37 )తో కూడా ఫర్వాలేదనిపించాడు. ఇక లక్ష్య ఛేదనలోకి దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్ వికెట్లను కోల్పోయింది.

Read Also : Off The Record: బీఆర్ఎస్‌లో ఆ నేతల మధ్య ఢీ తప్పదా..? డోర్నకల్ ఏం జరగబోతుంది..?