Site icon NTV Telugu

RCB vs RR: నత్తనడకన ఆర్సీబీ ఇన్నింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Rcb 10 Overs Score

Rcb 10 Overs Score

RCB Scored 78 Runs In First 10 Overs Against RR: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతోంది. తొలి 10 ఓవర్లలో 78 పరుగులు చేసింది. ఆర్సీబీ తరఫున ఓపెనింగ్ చేసిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్.. మొదట్లో చాలా నిదానంగా ఆడారు. బౌండరీల మోత మోగించాల్సిన పవర్ ప్లేతో.. సింగిల్స్, డబుల్స్‌తోనే సర్దుబాటు చేసుకున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే దారుణంగా నిరాశపరిచాడు. ఇది ఆర్సీబీకి అత్యంత కీలక మ్యాచ్ కాబట్టి.. ఇందులో కోహ్లీ దుమ్మురేపుతాడని అతని అభిమానులు భావించారు. కానీ.. అతడు టెస్ట్ ఇన్నింగ్స్‌తో నిరాశపరిచాడు. 19 బంతులు ఆడిన అతగాడు 18 పరుగులు మాత్రమే చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క ఫోర్ ఉంది. 18 వ్యక్తిగత పరుగుల వద్ద అసిఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.

Sukumar: సర్ మీరెందుకని పుష్ప 2లో మంచి క్యారెక్టర్ చెయ్యకూడదు?

మరోవైపు.. కోహ్లీతో పాటు ఓపెనింగ్ చేసిన డు ప్లెసిస్ బాగానే రాణిస్తున్నాడు. తనకు గాయం అయినప్పటికీ.. ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. క్లిష్టమైన బంతులు వచ్చినప్పుడు ఆచితూచి ఆడుతున్న ఈ ఫారిన్ ప్లేయర్.. అనుకూలమైన బంతులు వచ్చినప్పుడు మాత్రం విరుచుకుపడుతున్నాడు. గ్యాప్స్ వెతికి మరీ బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఇక కోహ్లీ ఔటయ్యాక వచ్చిన మ్యాక్స్‌వెల్.. వచ్చి రావడంతోనే తడాఖా చూపించడం మొదలుపెట్టాడు. తన బలాన్నంత వినియోగించి, హిట్టింగ్ చేస్తున్నాడు. తన జట్టుకి మంచి స్కోరు అందించడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఇక ఆర్ఆర్ బౌలర్ల విషయానికొస్తే.. అసిఫ్ ఒక వికెట్ తీసుకున్నాడు. మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ, ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. మరి.. తొలి 10 ఓవర్లలో నత్తనతకన ఆడిన ఆర్సీబీ, ఆ తర్వాతి 10 ఓవర్లలో ఎలా రాణిస్తుందో? ఆర్ఆర్ జట్టుకి ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి.

Vivek Agnihotri: అందరూ అందుకోసమే పెళ్లి చేసుకుంటున్నారు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version