RCB vs MI: రప్ఫాడిస్తున్న ఆర్సీబీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Scored 104 In First 10 Overs Against MI: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వాంఖడే స్టేడియంలో పరుగుల వర్షం కురిపిస్తోంది. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 104 పరుగులు చేసింది. డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆడుతున్న వీరోచితమైన ఇన్నింగ్స్ పుణ్యమా అని.. ఆర్సీబీ స్కోరు పరుగులు పెడుతోంది. నిజానికి.. మొదటి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడం, ఆ వెంటనే మూడో ఓవర్‌లో అనూజ్ పెవిలియన్ చేరడం చూసి.. ఆర్సీబీ ఒత్తిడికి గురవుతుందని, తద్వారా స్కోరు నత్తనడకన సాగుతుందని క్రికెట్ నిపుణులు అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ రప్ఫాడిస్తున్నారు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల సునామీ సృష్టిస్తున్నారు. తమ 360 డిగ్రీ ఆటతో ఆర్సీబీ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నారు.

Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
తొలుత నిదానంగా తన ఇన్నింగ్స్ ప్రారంభించిన డు ప్లెసిస్, ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. కోహ్లీ ఔట్ అయ్యాక వచ్చిన అనుజ్.. ఒక ఫోర్ కొట్టడం చూసి, ఈరోజు మంచి ఇన్నింగ్స్ ఆడుతాడని భావించారు. కానీ.. అతడు ఒక తప్పుడు షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయ్యాడు. అప్పుడు బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్.. వచ్చి రావడంతోనే తన తడాఖా చూపించడం స్టార్ట్ చేశాడు. మొదట్లోనే రెండు వికెట్లు పోయాయన్న ఒత్తిడికి గురవ్వకుండా.. ఆర్సీబీ బౌలర్లపై దండయాత్ర చేయడం ప్రారంభించాడు. ఇలా విజృంభించడం వల్లే.. అతగాడు వేగంగా తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్ వచ్చాక డు ప్లెసిస్ కాస్త శాంతించాడు. అలాగని మరీ నిదానంగా ఆడట్లేదు. మ్యాక్స్‌వెల్ దూకుడు మీద ఉన్నాడు కాబట్టి, అతనికి ఆడే ఛాన్స్ ఇచ్చాడు. 11వ ఓవర్‌లో డు ప్లెసిస్ సైతం తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. వీరి ఆటతీరు పుణ్యమా అని, ఆర్సీబీ స్కోరు తారాజువ్వలా దూసుకెళ్తోంది. మరి, 20 ఓవర్లలో వీళ్లు ఎంత స్కోరు కొడతారో, ముంబైకి ఎంత లక్ష్యం ఇస్తారో చూడాలి
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..