IPL 2022 : ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ 158..

Rr Vs Rcb

Rr Vs Rcb

ఐపీఎల్‌ సీజన్‌ 2022 చివరి దశకు చేరువైంది. ఈ నేపథ్యంలో జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది. అయితే.. ఐపీఎల్‌-2022లో భాగంగా క్వాలిఫైయర్‌-2లో అహ్మదాబాద్ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఆదిలోనే విరాట్‌ కోహ్లి వికెట్‌ కోల్పోయింది.

7 పరుగులు చేసిన కోహ్లి.. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.20 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్‌ పాటిదార్‌ 58 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్‌ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. బౌల్ట్‌, అశ్విన్‌ తలా వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.