ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఇవాళ 27వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లను బెంగళూరు బ్యాటర్లు ఊచకోత కోసేస్తున్నారు. 18 ఓవర్లలోనే ఆర్సీబీ ఓపెనర్స్ భారీగా పరుగులు 151/2 పరుగుల మార్క్ ను అందుకున్నారు. దీంతో పంజాబ్ బౌలర్లు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ల వికెట్ తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. దీంతో పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బార్ వరుస వికెట్లు తీశాడు.
Also Read : Army jawans dead: వాహనంలో మంటలు.. నలుగురు ఆర్మీ జవాన్లు సజీవదహనం
15 ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 151/2 పరుగుల చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ ఇప్పటి అర్థ సెంచరీ చేశాడు. విరాట్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్ తో 59 పరుగులు చేయగా.. ఫాప్ డుప్లెసిస్ సైతం అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు.. అందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రన్ వరుసగా బౌలర్లను మార్చిన కూడా ఫలితం మాత్రం శూన్యం వస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో స్కోర్ భారీగా పరుగులు చేస్తున్నారు.
Also Read : Women Commandos: కాబూల్‌కు మహిళా కమాండోలు.. భారత రాయబార కార్యాలయంలో విధులు
దీంతో ఇప్పటికే విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ మధ్య ఇప్పటికే 137 పరుగులు భాగస్వామ్యం నెలకొంది. దీంతో ఈ మ్యాచ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్కంఠ పోరులో ఈ మ్యాచ్ ను ఎలాగైన గెలవాలని పంజాబ్ కింగ్స్ పట్టుదలగా ఉంటే.. పంజాబ్ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చెల్లుతున్నట్లు కనిపిస్తుంది. విరాట్, ఫాప్ డు ఫ్లెసిస్ భాగస్వామ్యాన్ని పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్ ప్రీత్ బార్ సింగ్ విడదీశాడు. వరుస వికెట్లు తీసి ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లాడు. విరాట్ కోహ్లీ ( 59 ), గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ను ఔట్ చేసి పంజాబ్ శిబిరంలో సంతోషం నింపాడు. ప్రస్తుతం క్రీజులో ఫాప్ డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ ఉన్నారు.