NTV Telugu Site icon

Ravindra Jadeja: 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ భాయ్.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్

Jadeja

Jadeja

Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా వ‌రుస‌గా రికార్డులు సృష్టిస్తున్నారు. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించిన జడ్డూ 24 గంటల్లోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో మ‌రో ఘనత సాధించాడు. వాంఖ‌డే టెస్టులో కివీస్ పై రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు తీసి టెస్టుల్లో 15వ సారి ఈ ప్రదర్శన చేశాడు జడేజా. దీంతో భారత్ త‌ర‌ఫున‌ టెస్టుల్లో నాలుగోసారి 10 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా జడ్డూ భాయ్ చ‌రిత్ర సృష్టించాడు. త‌ద్వారా భార‌త దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో విశేషంగా రాణిస్తున్న జ‌డేజా కీల‌క‌మైన టెస్టులో స‌త్తా చాటి కివీస్ ను దెబ్బ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకుని నాలుగోసారి 10 వికెట్ల ఫీట్ ను అందుకున్నాడు.

Read Also: Bus Fall In Valley: బ్రేకులు ఫెయిలై లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి

కాగా, ప్రస్తుతం అనిల్ కుంబ్లే ఏడు సార్లు 10 వికెట్లు తీసి తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ 6 సార్లు 10 వికెట్లతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో హర్భజన్ సింగ్ ఉన్నాడు. ఇక, అనిల్ కుంబ్లే 63 మ్యాచుల్లో, అశ్విన్ 65 మ్యాచుల్లో ఈ ఘ‌న‌త సాధించ‌గా.. జ‌డేజా కేవలం 49 మ్యాచుల్లో 4వ‌సారి 10 వికెట్లను తీసుకున్నాడు. అలాగే, క‌పిల్ దేవ్ 65 మ్యాచుల్లో రెండు సార్లు ప‌ది వికెట్లు తీసుకున్నాడు. సిరీస్‌లో చివ‌రిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిఫ్స్‌ను ఔట్ చేసిన జ‌డేజా 14 సారి ఐదు వికెట్లను పడగొట్టాడు. దాంతో, టెస్టుల్లో ఐదో బౌల‌ర్‌గా జ‌డ్డూ భాయ్ చరిత్ర సృష్టించాడు. భారత వెట‌ర‌న్ పేస‌ర్లు జ‌హీర్ ఖాన్ , ఇషాంత్ శర్మల రికార్డులు కనిపించకుండా పోయాయి.