భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో రోజురోజుకు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అతను తన పేరిట ఒక పెద్ద రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, జడేజా మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. 147 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేని రికార్డు ఇప్పుడు జడేజా చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. జడేజా తర్వాత అశ్విన్ ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో 1943 పరుగులు, 369 వికెట్లు పడగొట్టాడు.
Read Also: Headache: ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా..? కారణాలివే
35 ఏళ్ల ఆల్ రౌండర్ కాన్పూర్ టెస్టులో భారీ రికార్డుపై కన్నేశాడు. ఒక్క వికెట్ తీయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు పూర్తి చేస్తాడు. దీంతో కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్‌గా అవతరించనున్నాడు. రాబోయే మ్యాచ్‌లో ఒక వికెట్ తీస్తే.. అతను తన పేరు మీద 300 టెస్ట్ వికెట్లు నమోదు చేయడమే కాకుండా, ఈ ఫార్మాట్‌లో 300 వికెట్లు, 3000 పరుగులు పూర్తి చేసిన 11వ ఆటగాడిగా అవతరిస్తాడు. అలాగే.. భారత్ తరుఫున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. జడేజా కంటే ముందు భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (434 వికెట్లు, 5248 పరుగులు), వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (522 వికెట్లు, 3422 పరుగులు) ఈ ఘనత సాధించారు.
Read Also: Liam Livingstone: లివింగ్‌స్టోన్ ఊచకోత.. ఒకే ఓవర్‌లో 28 రన్స్