Ravichandran Ashwin: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చ్ 9) మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుసగా 14 వన్డేల్లో భారత్ టాస్ కోల్పోగా.. అందులో రోహిత్ శర్మ సైతం క్రమంగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు.. దీంతో ఈసారైనా టాస్ గెలుస్తారా? లేదా? అనే దానిపై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఇక, దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవీచంద్రన్ అశ్విన్ స్పందించారు. భారత్ మాత్రం ఫైనల్‌లో టాస్ గెలవాల్సిన అవసరం లేదన్నాడు. తుది పోరులో టీమిండియానే హాట్ ఫేవరెట్ అంటూ పేర్కొన్నాడు.
Read Also: Mallikarjun Kharge: ప్రధాని మోడీ గత 11 ఏళ్లలో చెప్పిన 11 పెద్ద అబద్దాలు ఇవే..
ఇక, నా అభిప్రాయం ప్రకారం భారత్ ఈసారి కూడా టాస్ గెలవకుండా ఉంటేనే బాగుంటది అని అశ్విన్ అన్నారు. కివీస్‌కే ఏది ఎంచుకోవాలో వాళ్ల ఇష్టం.. అప్పుడు భారత్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసే ఛాన్స్ లేకపోలేదు.. కానీ, భారత్ ఇప్పటి వరకు ఈ ట్రోఫీలో టాస్ ఓడిపోయినప్పుడు లక్ష్య ఛేదనకు దిగినా.. తొలుత బ్యాటింగ్ చేసినా గెలిచిందన్నాడు. ఈసారి కూడా టీమిండియా విజయం సాధిస్తుందని నేను 54 – 46 శాతంగా ఉందని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్లు గతంలో రోహిత్ సేనను ఇబ్బంది పెట్టారు.. ఇప్పుడూ వారు కాస్త బలంగానే కనిపిస్తున్నారని తెలిపాడు. అలాగే, కేన్ విలియమ్సన్, రవీంద్ర జడేజా మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుందని చెప్పుకొచ్చాడు. కేన్ మామ లెగ్ స్టంప్ ఆవలకు వెళ్లేందుకు ట్రై చేస్తాడు.. కొన్నిసార్లు బౌలర్ నెత్తి మీదుగా షాట్లు ఆడతాడు.. బ్యాక్‌ఫుట్ మీద కట్‌షాట్లను ఆడేందుకు పక్కా ప్రయత్నిస్తాడు.. అందుకే జడ్డూ – కేన్ మధ్య పోరు టామ్ అండ్ జెర్రీ పోరాటం మాదిరిగా ఉంటుందన్నాడు. జడేజాపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు కేన్ విలియమ్సన్ తప్పకుండా ట్రై చేస్తాడని ఆర్ అశ్విన్ విశ్లేషించాడు.