Site icon NTV Telugu

Ravichandran Ashwin: బ్యాటర్లను కాపాడటానికి బౌలర్లను బలి చేస్తారా..?

Ashwin

Ashwin

Ravichandran Ashwin: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియా మేనేజ్మెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. పెర్త్‌ వన్డేలో భారత జట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్‌ డెప్త్‌ కోసం బౌలింగ్‌ విభాగాన్ని నీరు గార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ తీరును అశూ తప్పుబట్టాడు. వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నాకు అర్థం కావడం లేదు.. పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్‌లో డెప్త్‌ కోసమే.. ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్లు సుందర్‌, అక్షర్‌ కూడా బ్యాటింగ్‌ చేస్తారు కాబట్టి నితీశ్‌ను వారికి జతచేశారు అని పేర్కొన్నారు.

Read Also: Delhi: ఢిల్లీలో మళ్లీ బెంబేలెత్తిస్తున్న పొల్యూషన్.. పడిపోయిన గాలి నాణ్యత

ఇక, అసలు మీరెందుకు ( టీమిండియా మేనేజ్‌మెంట్‌) బౌలింగ్‌పై దృష్టి పెట్టడం లేదు బాస్‌ అని అశ్విన్ ప్రశ్నించారు. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్‌ యాదవ్‌ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్‌ చేయగలడు?.. ఈ పిచ్‌పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్‌ కూడా రాబట్టగలడు అని పేర్కొన్నారు. ఏదైనా అంటే.. బ్యాటింగ్‌ డెప్త్‌ అని మాట్లాడుంటారు.. బ్యాటింగ్‌ ఆర్డర్‌ రాణించాలంటే.. బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాలి.. పరుగులు రాబట్టడం వాళ్ల పని.. కానీ, అదనపు బ్యాటర్‌ కోసం ఆల్‌రౌండర్లను ఆడించి బ్యాటర్ల పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? అని క్వశ్చన్ చేశారు. జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్లను పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం? అని రవిచంద్రన్ అశ్విన్ అడిగారు.

Read Also: Bandla Ganesh Party: ప్లేట్ 15వేలు.. నైటుకు కోటిన్నర

అయితే, ఆస్ట్రేలియాతో బౌలర్ల ధాటికి భారత టాపార్డర్‌ నెలకూలింది. రోహిత్‌ శర్మ 8, గిల్‌ 10, శ్రేయస్‌ అయ్యర్‌ (11) పరుగులు చేయగా.. విరాట్‌ కోహ్లి డకౌట్‌ అయి తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఇక, కేఎల్ రాహుల్ 28, అక్షర్‌ పటేల్‌ 31 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్‌రౌండర్లలో వాషింగ్టన్‌ సుందర్‌(10), నితీశ్‌ కుమార్‌ రెడ్డి 19 (నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించగా.. తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేసింది టీమిండియా.. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 21.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు నష్టానికి 131 పరుగులు చేసింది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌- భారత్‌ మధ్య గురువారం నాడు అడిలైడ్‌ వేదికగా రెండో వన్డే జరగనుంది.

Exit mobile version