అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రషీద్ క్రికెట్ ఆటతో కాకుండా.. అతడి వ్యక్తిగత జీవితం కారణంగా నెట్టింట చర్చనీయాంశంగా మారాడు. ఇటీవలి కార్యక్రమంలో రషీద్ ఓ మహిళతో కనిపించడమే ఇందుకు కారణం. ‘మిస్టరీ గర్ల్’తో రషీద్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. అఫ్గాన్ స్పిన్నర్ రెండో వివాహం చేసుకున్నాడని నెట్టింట చర్చ మొదలైంది. ఈ విషయం రషీద్ వరకు చేరగా.. అసలు విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
రషీద్ ఖాన్ ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ‘ఖాన్ ఛారిటీ ఫౌండేషన్’ ప్రారంభోత్సవానికి వెళ్ళాడు. ఆ కార్యక్రమానికి రషీద్ ఓ అమ్మాయితో హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. దీంతో ఈ అమ్మాయి ఎవరు అనే చర్చ మొదలైంది. రషీద్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడని నెట్టింట ఊహాగానాలు వచ్చాయి. చివరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రషీద్ ఆ ఊహాగానాలకు తెరదించాడు. నిజమే తాను పెళ్లి చేసుకున్నా అని, ఆమె తన సతీమణి అని స్పష్టం చేశాడు. రషీద్ భార్య హిజాబ్ లేకుండా కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే అభిమానులు ఆమెను గుర్తించలేకపోయారు.
Also Read: Syed Ahmed Mohiuddin: మా బ్రదర్ మంచోడు, కావాలనే ఎవరో ఇరికించారు.. మొహియుద్దీన్ సోదరుడి ఆవేదన!
‘2 ఆగస్టు 2025న నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నేను పెళ్లి చేసుకున్నా. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆమె నా జీవిత భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇటీవల నా భార్యను ఓ ఛారిటీ కార్యక్రమానికి తీసుకెళ్లాను. ఇంత చిన్న విషయంపై రకరకాల ఊహాగానాలు రావడం దురదృష్టకరం. ఆమె నా భార్య. మేము కలిసి ఉన్నాము. మా మధ్య దాచడానికి ఏమీ లేదు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. నిజానికి రషీద్ 3 అక్టోబర్ 2024న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో వివాహం చేసుకున్నాడు. తన పోస్టులో గత ఆగస్టులో వివాహం చేసుకున్నా అని చెప్పాడు. అంటే రషీద్ రెండో వివాహం చేసుకున్నాడని అర్ధమవుతోంది. ఏదేమైనా సోషల్ ఆ ‘మిస్టరీ గర్ల్’ మాత్రం అతడి సతీమణి.
