Site icon NTV Telugu

IPL 2022 : ఢిల్లీపై రాజస్తాన్‌ ఘన విజయం..

Rajasthan Royals

Rajasthan Royals

ఈ రోజు ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఈ రోజు మంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచి ఢిల్లీ క్యాపిటన్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో రెండు వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగుల‌ భారీ స్కోరును ఢిల్లీ జట్టు ముందుంచింది. అయితే రాజ‌స్తాన్ ఓపెన‌ర్లు జోష్ బ‌ట్ల‌ర్‌, ప‌డిక్క‌ల్‌ ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 155 ప‌రుగులు చేసింది. 155 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 54 ప‌రుగులు చేసిన పడిక్క‌ల్.. ఖాలీల్ ఆహ్మ‌ద్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఖాలీల్ ఆహ్మ‌ద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో రాజ‌స్తాన్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ సెంచ‌రీతో మెరిశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఈ సీజ‌న్‌లో అత‌డికి మూడో సెంచ‌రీ కావ‌డం విశేషం.

అనంతరం 223 ప‌రుగుల లక్ష్య చేధనకు బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వార్నర్‌ రూపంలో మొదటి వికెట్‌ను కోల్పోయింది. 48 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ రెండో వికెట్, 99 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ క్యాపిట‌ల్స్ మూడో వికెట్, 124 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ క్యాపిట‌ల్స్ నాలుగో వికెట్, 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి 162 ప‌రుగులు చేసింది. అఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 15 ప‌రుగుల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఘన విజ‌యం సాధించింది. ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన‌ అఖ‌రి ఓవ‌ర్లో 36 ప‌రుగులు అవ‌స‌ర‌మవ్వ‌గా.. పావెల్‌ తొలి మూడు బంతుల‌కు మూడు సిక్స‌ర్‌లు బాది ఢిల్లీ విజ‌యంపై ఆశ‌లు రేపాడు. అయితే చివ‌రి మూడు బంతుల్లో కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 223 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి ఎగబాకింది.

Exit mobile version