Rajasthan Royals Won The Match By 4 Wickets Against PBKS: ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో.. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 19.4 బంతుల్లో (189) రాజస్థాన్ ఛేధించింది. పడిక్కల్ (51), యశస్వీ (50), షిమ్రాన్ హెట్‌మేయర్ (46) పరుగులతో రాణించడంతో.. రాజస్థాన్ ఈ గెలుపును సొంతం చేసుకోగలిగింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించగా.. రాజస్థాన్ తన ప్లేఆఫ్స్ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. అయితే.. ఇది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తమతమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓటమిపాలైతే.. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కి వెళ్తుంది. లేకపోతే.. ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.
Vijayasai Reddy: రూ.2 వేల నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సామ్ కర్రన్ (49), జితేశ్ శర్మ (44), షారుఖ్ ఖాన్ (41) మెరుగైన ఇన్నింగ్స్‌తో రాణించడంతో.. పంజాబ్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. తొలుత ఆర్ఆర్ జట్టుకి జాస్ బట్లర్ (డకౌట్) వికెట్ రూపంలో పెద్ద ఝలక్ తగిలినా.. ఆ తర్వాత జైస్వాల్, పడిక్కల్ అద్భుతంగా రాణించి తమ జట్టుని ఆదుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ 2 పరుగులే చేసి నిరాశపరిచాడు. అప్పుడు బరిలోకి దిగిన షిమ్రాన్ హెట్‌మేయర్ తన బలం చూపించాడు. పంజాబ్ బౌలర్లపై అతడు తాండవం చేశాడు. మైదానంలో కాసేపు బౌండరీల మోత మోగించి.. జట్టుని లక్ష్యానికి చేరువగా తీసుకెళ్లాడు.
రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న ఈ హీరోను గుర్తుపట్టారా..?
షిమ్రాన్ ఈ మ్యాచ్ ముగిస్తాడని అనుకుంటే.. అతడు ఊపులో అనవసరమైన షాట్ కొట్టి, క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. మొదటి మూడు బంతులకు 4 పరుగులు తీశారు. ఇక నాలుగో బంతికి సిక్స్ కొట్టి.. ధృవ్ జురేల్ తన జట్టుని గెలిపించాడు. పంజాబ్ బౌలర్ల విషయానికొస్తే.. రబాడా రెండు వికెట్లు తీయగా.. కర్రన్, అర్ష్‌దీప్, నథన్ ఎల్లిస్, రాహుల్ చహార్ తలా వికెట్ పడగొట్టారు.