RR vs LSG: దుమ్మురేపిన యంగ్‌స్టర్స్.. లక్నో టార్గెట్ 179
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో పెద్దగా సత్తా చాటని యువ ఆటగాళ్ళు.. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్ క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే లక్నో బౌలర్స్‌పై దండయాత్ర చేశాడు. దీంతో 29 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్‌తో 41 పరుగులు చేశాడు.
సెంచరీల ధీరుడు జాస్ బట్లర్ 2 పరుగులకే వెనుదిరగగా.. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు. తదనంతరం వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లోనే 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్ళు తమవంతు స్కోర్స్ జోడించడంతో.. రాజస్థాన్ జట్టు స్కోర్ 178/6 కి చేరింది. అటు బౌలింగ్ విషయానికొస్తే.. మోహసీన్, చమీరా పరుగుల్ని బాగా సమర్పించుకున్నారు. రవి బిష్ణోయి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. అన్వేశ్ ఖాన్, జేసన్ హోల్డర్, ఆయుశ్ బదోని చెరో వికెట్ తీశారు. 179 పరుగుల టార్గెట్‌తో రంగంలోకి దిగిన లక్నో.. ఆ లక్ష్యాన్ని చేధించగలుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Also Read
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!