Site icon NTV Telugu

IPL 2022 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ..

Rr Vs Dc

Rr Vs Dc

ఐపీఎల్‌ 2022 సీజన్‌ జోష్ మామూలుగా లేదు. నువ్వా నేనా అన్నట్లుగా జట్ల మధ్య పోటీ నడుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.

దీంతో ఈ మ్యాచ్‌కు రికీ పాంటింగ్ దూరం కానున్నాడు. ఢిల్లీ టీమ్ హోటల్‌లో పాంటింగ్‌తో పాటు బస చేస్తున్న అత‌డి కుటుంబ స‌భ్యుల‌లో ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణైంది. ఈ నేపథ్యంలో అత‌డు తన‌ ఫ్యామిలీతో పాటు ఐసోలేషన్‌లోకి వెళ్ల‌నున్నాడు. ఇప్ప‌టికే ఢిల్లీ జట్టులో క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌ను బీసీసీఐ పుణే నుంచి వాంఖ‌డే స్టేడియంకు మార్పుచేసింది.

Exit mobile version