Site icon NTV Telugu

RR vs GT: పేకమేడలా కూలుతున్న రాజస్థాన్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Rajasthan 10 Overs Score

Rajasthan 10 Overs Score

Rajasthan Royals Scored 72 In First 10 Overs: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేకమేడలా కూలుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఆర్ఆర్ జట్టు.. తొలి 10 ఓవర్లలో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి, కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. తొలుత విధ్వంసకర బ్యాటర్ జాస బట్లర్ క్యాచ్ ఔట్ అవ్వగా.. ఆ తర్వాత అవసరం లేని పరుగు తీసి, యశస్వీ జైస్వాల్ రనౌట్ అయ్యాడు. యశస్వీ వికెట్ విషయంలో రన్ తీస్తున్నప్పుడు కెప్టెన్ సంజూ, యశస్వీ మధ్య గందరగోళం నెలకొంది. బంతి ఫీల్డర్ చేతికి చిక్కిందని సంజూ క్రీజు వద్దే ఆగిపోగా.. యశస్వీ అప్పటికే సగం మైదానం దాటేసి దాదాపు సంజూ దగ్గరికి చేరుకున్నాడు. అతడు తిరిగి వచ్చేలోపే.. రనౌట్ అయ్యాడు.

Sharad Pawar: తన రాజీనామాను ఉపసంహరించుకున్న శరద్ పవార్

ఆ తర్వాత సంజూ శాంసన్ కాసేపు మెరుపులు మెరిపించాడు. అదే జోరు కొనసాగించాలని అనుకున్నాడు. కానీ, అదే అతని కొంప ముంచింది. షాట్ కొట్టాలనుకున్న బంతి స్ట్రెయిట్‌గా రావడంతో.. ఎలా ఆడాలో తెలియక లెగ్ సైడ్ ఆడేందుకు ట్రై చేశాడు. అయితే.. అది బ్యాట్ అంచున తాకి పైకి ఎగరడంతో, హార్దిక్ పాండ్యా క్యాచ్‌గా అందుకున్నాడు. అనంతరం వెనువెంటనే రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్ వికెట్లు పడ్డాయి. అశ్విన్‌ని రషీద్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. అతని బౌలింగ్‌లోనే రియాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇప్పుడు రాజస్థాన్ జట్టుని పడిక్కల్, హెట్‌మెయర్, జురేల్ మాత్రమే ఆదుకోవాలి. గతంలో వీళ్లు ముగ్గురు మంచి ఇన్నింగ్సే ఆడారు. ప్రస్తుతం వీరి అవసరం జట్టుకి ఎంతైనా ఉంది కాబట్టి.. ఎంతమేర రాణిస్తారో చూడాలి.

RR vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్

Exit mobile version