Site icon NTV Telugu

IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్

Pbks Rr

Pbks Rr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ధర్మశాల వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఈ రెండు టీమ్స్ కీలకం. గెలిచిన జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉంటే ఓడిన టీమ్ ఇంటికి వెళ్లనుంది. టాస్ గెలిచిన సంజూ శాంసన్ సేన పీల్డింగ్ తీసుకోవడంతో.. పంజాబ్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ కు వచ్చింది.

Also Read : Kakani Govardhan Reddy: చంద్రబాబుకి తన కొడుకు లోకేష్ కూడా మోసం చేస్తాడనే అనుమానం ఉంది

తాము తొలుత బౌలింగ్ చేస్తామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. మేం ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. గత మ్యాచ్ ల్లో మా టీమ్ కొంత నిరాశ పరిచింది. కానీ ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు గట్టి పోటీ చేస్తామని సంజూ శాంసన్ వెల్లడించారు. మేము నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకుని ఈ మ్యాచ్ ఆడుతున్నాం.. మాకు కొద్దీగా టైం దొరికింది.. పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతామని సంజూ అన్నాడు. ఈ మ్యాచ్ లో రెండు మార్పులు ఉన్నట్లు పేర్కొన్నాడు. చివరి నిమిషంలో రవిచంద్రన్ ఆశ్విన్ వెన్ను నొప్పి కారణంగా తప్పుకున్నట్లు సంజూ శాంసన్ అన్నాడు.

Also Read : Mancherial : మంచిర్యాలలో మహిళ దారుణ హత్య

అయితే లాస్ట్ మ్యాచ్ లో ధర్మశాలలో ఎక్కువగా మంచు లేదని పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ అన్నాడు. మొదటి బ్యాటింగ్ చేసినా.. సెకండ్ ఇన్సింగ్స్ లో బ్యాటింగ్ చేసిన పెద్దగా మార్పు ఏం ఉండదని పేర్కొన్నాడు. ఈ గేమ్ లో మా బెస్ట్ మేం ఇచ్చేందుకు కృషి చేస్తామని శిఖర్ ధావన్ అన్నాడు. తొలి 6 ఓవర్లలో ( పవర్ ప్లే ) మరిన్ని వికెట్లు తీయాలి.. భారీ పరుగులు చేసేలా ప్లాన్ చేస్తామని ధావన్ తెలిపాడు.

Also Read : Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (సి), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(w), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

Exit mobile version