Site icon NTV Telugu

MI vs RR : ముంబై బౌలర్లను ఉతికి ఆరేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. టార్గెట్ ఎంతో తెలుసా..?

Rajasthan

Rajasthan

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని 1000వ మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో జైశ్వాల్ ఈ ఫీట్ నమోదు చేశాడు.

Also Read : MS Dhoni : సీఎస్కే బౌలర్లు వికెట్లు తీస్తున్నా.. ఏం లాభం..!

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కి జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ కలిసి శుభారంభం అందించారు. కామెరూన్ గ్రీన్ వేసిన మొదటి ఓవర్‌లో సిక్సర్‌తో ఖాతా తెరిచిన యశస్వి జైస్వాల్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో జోస్ బట్లర్ అవుటైనట్టు అంపైర్ ప్రకటించినా రివ్యూ తీసుకోవడంతో రాజస్థాన్‌ రాయల్స్‌కి ఫలితం దక్కింది. టీవీ రిప్లైలో ఆ బంతి వైడ్‌గా వెళ్తున్నట్టు కనిపించింది. రిలే మెడరిత్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదిన యశస్వి జైస్వాల్, 16 పరుగులు రాబట్టాడు.

Also Read : Kodali Nani Sensational Comments Live: పవన్ కళ్యాణ్ స్క్రాప్.. కొడాలి నాని కామెంట్స్

పియూష్ చావ్లా బౌలింగ్‌లో జోస్ బట్లర్ రమణ్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వస్తూనే సిక్సర్ బాదిన సంజూ శాంసన్, ఆ తర్వాతి బంతికి అవుట్‌గా ప్రకటించబడ్డాడు. అయితే టీవీ రిప్లైలో బంతి బ్యాటుకి తగలడం లేదని క్లియర్‌గా కనిపించడంతో శాంసన్‌కి లైఫ్ దొరికింది.. అయితే దీన్ని పెద్దగా సంజూ శాంసన్ ఉపయోగించుకోలేకపోయిన, 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్‌ని పియూష్ చావ్లా క్లీన్ బౌల్డ్ చేయడంతో వెంటవెంటనే రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది.

Also Read : MI vs RR : బ్యాటింగ్ లో అదరగొడుతున్న రాజస్థాన్.. 10ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?

జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చిన జేసన్ హోల్డర్ ( 9 ) అవుట్ అయ్యాడు. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో సిమ్రాన్ హెట్మయర్ ( 8 ) సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. 3 బంతుల్లో 2 పరుగులు చేసిన ధృవ్ జురెల్, రిలే మెడరిత్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ మాత్రం బౌండరీలతో చెలరేగిపోయాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Also Read : Salman Khan: ఏయ్.. నాకు పెళ్లి వద్దు.. కానీ, పిల్లలు మాత్రం కావాలి.. అది కూడా అలా

సెంచరీ పూర్తయిన తర్వాత జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన యశస్వి జైస్వాల్, అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుస బౌండరీలతో రెచ్చిపోయి ఆడాడు. 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసిన జైస్వాల్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ గా వెనుదిరిగిపోయాడు. ఆఖరి ఓవర్‌లో ఫోర్ బాది రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 213 పరుగులు చేజ్ చేయనుంది.

Exit mobile version