Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన రాహుల్ సమిత్
- క్లాసిక్ కవర్ డ్రైవ్‌లు, బ్యాక్‌ఫుట్ కట్ షాట్లు
- మైదానం నలుమూలలా 360 డిగ్రీ బ్యాటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samit Dravid Stuns with 360-Degree Batting: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టీ20 ట్రోఫీలో భాగంగా బుధవారం హుబ్లీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో సమిత్ ఆడిన ఇన్నింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లాసిక్ కవర్ డ్రైవ్‌లు, బ్యాక్‌ఫుట్ కట్ షాట్లు, పుల్ షాట్లతో పాటు మైదానం నలుమూలలా 360 డిగ్రీ బ్యాటింగ్ ప్రదర్శిస్తూ అభిమానులను అలరించాడు.
కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్ తరఫున బరిలోకి దిగిన 20 ఏళ్ల సమిత్ ద్రవిడ్.. హుబ్లీ టైగర్స్‌పై 23 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు అద్భుతమైన ఫోర్లు ఉన్నాయి. రెండో వికెట్‌కు రోహన్ పాటిల్‌తో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. సమిత్ బ్యాటింగ్‌లో అతని తండ్రి రాహుల్ ద్రవిడ్ శైలి కనిపించిందని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. సమిత్ బ్యాటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాసికల్ టెక్నిక్కు ఆధునిక టీ20 షాట్లను జోడిస్తూ ఆకట్టుకుంటున్న సమిత్.. భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- The Hundred Women's Champions: కావ్య మారన్‌కు నిరాశ.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
- The Hundred Men's Champions: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. తొలిసారి 'ది హండ్రెడ్' ఛాంపియన్స్‌గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.!
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహన్ పాటిల్ 38 బంతుల్లో 64 పరుగులు, ప్రవీణ్ దూబే 28 బంతుల్లో 51 పరుగులతో అర్ధశతకాలు నమోదు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించారు. చివర్లో శివరాజ్ ఏడు బంతుల్లో 23 పరుగులు చేశాడు. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హుబ్లీ టైగర్స్ చివరి బంతి వరకు పోరాడింది. అనీశ్వర్ గౌతమ్ (34), శివకుమార్ రక్షిత్ (41), మన్వంత్ కుమార్ 22 బంతుల్లో 60 పరుగులతో మెరుపులు మెరిపించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన సమయంలో హుబ్లీ టైగర్స్ 7 వికెట్లకు 201 పరుగులకే పరిమితమై రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు బ్లాస్టర్స్ బౌలర్లలో నిశ్చిత్ రావు 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించగా.. విద్వత్ కావేరప్ప రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో బెంగళూరు బ్లాస్టర్స్ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో ఆరో విజయాన్ని నమోదు చేసి.. 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
తాజావార్తలు
-
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
-
Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
-
Explainer: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
-
Mahesh Babu : ‘డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్‌స్టాండింగ్
-
AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?