Site icon NTV Telugu

BWF టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ పీవీ సింధు సత్తా చాటుతోంది. ఈ మేరకు గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌ను 21-14, 21-18 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 48 నిమిషాల పాటు జరిగిన రౌండ్-3 మ్యాచ్‌లో విజయం సాధించడంతో పీవీ సింధు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి పోరులో తైవాన్ క్రీడాకారిణి తై జు యింగ్‌తో పీవీ సింధు తలపడనుంది.

Read Also: కోహ్లీ చేసింది మంచి పని కాదు: కపిల్ దేవ్

మరోవైపు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఏడాది పెద్ద విజయాలేమీ సాధించలేదు. పీవీ సింధు మాత్రం టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలిచింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఇక ఏడాది భారత షట్లర్లు ఆడిన పలు టోర్నీల్లో ఓటములు ఎదురయ్యాయి. ఈ ఏడాదికి చివరి మెగా టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరుగుతున్నాయి. భారత షట్లర్లు ఈ టోర్నీలో శుభారంభం చేసి దూసుకుపోతుండటం విశేషం.

Exit mobile version