Site icon NTV Telugu

MI vs PBKS: ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్.. 10 ఓవర్లలో పంజాబ్ స్కోరు ఇది!

Punjab 10 Overs Score

Punjab 10 Overs Score

Punjab Kings Scored 78 Runs In First 10 Overs Against Mumbai Indians: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో.. పంజాబ్ స్కోరు నిదానంగా ముందుకు కదులుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి.. పంజాబ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. అయితే.. పంజాబ్‌లో పరుగుల సునామీ సృష్టించగల విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు కాబట్టి, తర్వాతి 10 ఓవర్లలో లెక్కలు మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ పంజాబ్ బ్యాటర్లు విజృంభిస్తే.. 200 పరుగుల మైలురాయి దాటే ఆస్కారం ఉంది. అంత భారీ స్కోరు రాకుండా ఉండాలంటే.. తొలి 10 ఓవర్ల తరహాలోనే ముంబై బౌలర్లు మాయాజాలం పరచాలి. పంజాబ్ బ్యాటర్లకు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకుండా గందరగోళానికి గురి చేయాలి. మరి.. తర్వాతి 10 ఓవర్లు ఎలా ఉంటాయో చూడాలి.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఈడీ తప్పిదం.. ఆప్‌ నేతకు క్షమాపణలు

క్రీజులోకి అడుగుపెట్టిన మొదట్లోనే పంజాబ్ జట్టుకి షాక్ తగిలింది. ప్రభ్‌సిమ్రన్ (7 బంతుల్లో 9) 13 పరుగుల వద్ద కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన మాథ్యూ షార్ట్‌తో కలిసి.. కెప్టెన్ శిఖర్ ధవన్ (20 బంతుల్లో 5 ఫోర్ల సహకారంతో 30) తన జట్టు స్కోరుని ముందుకు నడిపించాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ.. అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా విరుచుకుపడుతూ వచ్చారు. శిఖర్ ఇలా చెలరేగిపోదామని అనుకున్న తరుణంలో.. స్టంప్ ఔట్ అయ్యాడు. 62 పరుగుల వద్ద అతడు పెవిలియన్ చేరాడు. శిఖర్ ఔట్ అయినప్పటి నుంచి పంజాబ్ జోరు కొంచెం తగ్గింది. మాథ్యూ షార్ట్ తన దూకుడు తగ్గించుకోగా.. లియాన్ లివింగ్‌స్టన్ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ముంబై బౌలర్ల విషయానికొస్తే.. అర్షన్ ఖాన్, పియూష్ చావ్లా చెరో వికెట్ పడగొట్టారు.

Naga Chaitanya: పెళ్ళయ్యాక యావరేజ్ గా ఉన్నాడు.. విడాకులు తీసుకున్నాక ఏంటిరా ఇంత అందంగా ఉన్నాడు

Exit mobile version