Site icon NTV Telugu

IPL Mega Auction: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌కు భారీ ధర

బెంగ‌ళూరులో ఐపీఎల్ వేలం కొన‌సాగుతోంది. రెండోరోజు వేలంలో ఇప్పటివరకు చూసుకుంటే.. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండ‌ర్ లివింగ్‌స్టోన్ అత్యధిక ధర పలికాడు. లివింగ్ స్టోన్‌ కనీస ధర రూ.కోటి కాగా… పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా అతడిని రూ.11.5 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ హిట్టర్ కావడంతో అతడిని దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు పోటీ పడింది. అత‌డు బంతితోనేగాక బ్యాట్‌తోనూ ఆట‌ను మ‌లుపు తిప్పగ‌ల‌డు. బంతితో స‌మ‌ర్థంగా ఆఫ్ స్పిన్‌, లెగ్ స్పిన్ బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. అందుకే ఈసారి ఐపీఎల్ వేలంలో లివింగ్ స్టోన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.

అటు ఇటీవల అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియాకు కప్పు సాధించిపెట్టడంలో ప్రముఖ పాత్ర వహించిన ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన ఒడియన్ స్మిత్‌ను రూ.6 కోట్లు ఖర్చు పెట్టి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కాగా ఐపీఎల్ వేలం రెండో రోజు ఇషాంత్ శర్మ, జిమ్మీ నీషమ్, క్రిస్ జోర్డాన్, లుంగి ఎంగిడి, షెల్డన్ కాట్రెల్, నాథన్ కౌల్టర్ నైల్, షంసి, క్వయిస్ అహ్మద్, కరణ్ శర్మ, ఇష్ సోధి, పీయూష్ చావ్లా, విరాట్ సింగ్, హిమ్మత్ సింగ్, సచిన్ బేబీ, హర్నూర్ సింగ్, హిమాంషు రాణా, రికీ భుయ్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.

Exit mobile version