NTV Telugu Site icon

GT vs PBKS: ఓవైపు వికెట్లు.. మరోవైపు పరుగులు.. నెట్టుకొస్తున్న పంజాబ్

Pbks Vs Gt

Pbks Vs Gt

Punjab Kings Batting Innings Update: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. మొదట్లోనే పంజాబ్ జట్టుకి రెండు పెద్ద ఝలక్‌లు తగిలాయి. సున్నా పరుగులకే ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఔట్ అవ్వగా.. 28 పరుగుల వద్ద భారీ షాట్ కొట్టబోయి కెప్టెన్ శిఖర్ ధవన్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నిజానికి.. శిఖర్ ధవన్ గత మ్యాచ్ తరహాలోనే దుమ్ముదులిపేస్తాడని అనుకున్నారు. కానీ.. ఈసారి అతడు నిరాశపరిచాడు. కేవలం 8 వ్యక్తిగత పరుగులకే ఔటయ్యాడు.

CM Jagan Mohan Reddy: గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష.. వాటిని తిప్పికొట్టాలంటూ సూచన

అనంతరం మాట్ షార్ట్ ఏడో ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ విదేశీ ఆటగాడు 24 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సహకారంతో 36 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న షాట్.. ఈ మ్యాచ్‌లో ఊచకోత కోయం ఖాయమని అనుకున్న తరుణంలో.. రషీద్ ఖాన్ ఆ ఆశలపై నీళ్లు చల్లేశాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మతో కలిసి రాజపక్స మంచి భాగస్వామ్యం జోడించాడు. వీళ్లిద్దరు ఆచితూచి ఆడుతూ.. తమ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. భారీ షాట్లు కొట్టకపోయినా.. వీలు చిక్కినప్పుడల్లా పరుగులు తీస్తూ, అప్పుడప్పుడు బంతిని బౌండరీలు దాటించారు. ఆదిలోనే ప్రధాన వికెట్లు పడిపోయి జట్టు కష్టాల్లో ఉండటంతో.. వీళ్లు నిదానంగా ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నారు. గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే.. షమీ, రషీద్ ఖాన్, జాషువా లిటిల్ తలా వికెట్ తీసుకున్నారు. గుజరాత్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకుండా.. కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తున్నారు.

Madhya Pradesh : లవ్ మ్యారేజ్ చేసుకుంది.. మరో లవర్ దొరకగానే ‘మాజీ’ని మట్టుపెట్టింది