Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ పేసర్, స్వింగ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ మరోసారి భారత క్రికెట్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాటు చేయనున్న జూనియర్ సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా గ్రాస్‌రూట్ స్థాయి నుంచి యువ ప్రతిభను గుర్తించి.. తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
భారత క్రికెట్‌కు తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతోనే దరఖాస్తు చేసుకున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. కోచింగ్‌లో అనుభవం ఉండటంతో పాటు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో సెలెక్టర్‌గా కూడా పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. ‘అవును.. జూనియర్ సెలెక్షన్ కమిటీ కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను రిటైర్ అయ్యాను. ఇప్పుడు భారత క్రికెట్‌కు నా వంతు సహకారం అందించాలని అనుకుంటున్నాను. గతంలో కోచింగ్ చేశాను. యూపీసీఏలో సెలెక్టర్‌గా కూడా పనిచేశాను. అందుకే ఈ పదవికి దరఖాస్తు చేయాలని భావించాను’ అని ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Also Read
దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి వారికి సరైన మార్గనిర్దేశం అందించడమే ఈ కొత్త జూనియర్ సెలెక్షన్ ప్యానెల్ ప్రధాన లక్ష్యం. గ్రాస్‌రూట్ స్థాయిలో ప్రతిభను గుర్తించడం, యువ ఆటగాళ్లను అభివృద్ధి చేయడం, భవిష్యత్ భారత జట్లకు అవసరమైన టాలెంట్ పూల్‌ను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కమిటీ దృష్టి సారించనుంది. ఈ కమిటీలో చోటు కోసం పలువురు మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రవీణ్ కుమార్‌తో పాటు మాజీ భారత క్రికెటర్లు రమేశ్ పవార్, సుదీప్ త్యాగి కూడా దరఖాస్తు చేసుకున్న జాబితాలో ఉన్నారట.
ప్రవీణ్ కుమార్ భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడారు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల సామర్థ్యంతో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. భారత్ తరఫున ప్రవీణ్ కుమార్ 6 టెస్టులు ఆడి 27 వికెట్లు తీశారు. వన్డేల్లో 68 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు పడగొట్టారు. టీ20ల్లో 10 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీశారు. 2011 ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ప్రవీణ్ కుమార్.. లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశారు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. నాలుగు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి భారత జట్టు సిరీస్ విజయంలో తన వంతు సహకారం అందించారు.
తాజావార్తలు
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!