Site icon NTV Telugu

Praful Hinge: వైభవ్ సూర్యవంశీ బలహీనతను ఎక్స్‌పోజ్ చేసిన ప్రఫుల్ హింజ్..

Vaibhav

Vaibhav

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింజ్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే సంచలనం సృష్టించాడు. తన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని ప్రఫుల్ సున్నా పరుగులకే (గోల్డెన్ డక్) ఔట్ చేశాడు. సూర్యవంశీని ఎలా ఔట్ చేశాడో, తన వ్యూహాన్ని హింజ్ వెల్లడించాడు. ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ 217 పరుగుల ఛేజింగ్‌లో ఒక దశలో 5 వికెట్లకు 9 పరుగుల దూరంలో నిలిచింది. ఆర్ఆర్ అంతకు ముందు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అరంగేట్రం చేసిన హింజ్ తన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీయడంతో రాజస్థాన్ ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది.

ఇప్పుడు, సూర్యవంశీపై తన వ్యూహాన్ని ప్రఫుల్ వెల్లడించాడు. వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం ప్రఫుల్ హింజ్ తన వ్యూహాన్ని వెల్లడించాడు. జియోస్టార్/పోస్ట్-మ్యాచ్ ఇంటర్వ్యూలో హింజ్ ఇలా అన్నాడు.. “వైభవ్ సూర్యవంశీ వికెట్ నాకు చాలా ఆనందం ఇచ్చింది ఎందుకంటే అతను ఫామ్‌లో ఉన్నాడు. నేను 2-3 మందికి ముందే చెప్పాను.. ‘మెయిన్ ఇస్కో పెహ్లీ బాల్ పే బౌన్సర్ డాల్ కే అవుట్ కరుంగా’. నాకు కేవలం మొదటి బంతికే అతన్ని ఔట్ చేయాలని ఉంది. బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్ (వరుణ్ ఆరోన్) సహాయంతో ఈ ప్లాన్ చేశాం.”అండర్-13 లేదా యూత్ లెవల్‌లో సూర్యవంశీతో ఆడిన అనుభవం కూడా హింజ్‌కు సహాయపడింది.

బౌన్సర్‌తో అతన్ని ఔట్ చేసిన గతం ఉండటంతో, ఈ మ్యాచ్‌లో కూడా అదే వ్యూహం అమలు చేశాడు. సూర్యవంశీ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ హార్డ్ లెంగ్త్ బంతి (బ్యాక్ ఆఫ్ లెంగ్త్) వేగంగా రావడంతో టైమింగ్ కుదరక, టాప్ ఎడ్జ్ తీసి వికెట్ కీపర్ సలీల్ అరోరా చేతికి చిక్కాడు. హింజ్ మాట్లాడుతూ.. “నేను అతనికి రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయాలనుకున్నాను కానీ కోచ్ ఓవర్ ది వికెట్ సలహా ఇచ్చారు. అలాగే చేసి, అదే బంతితో వైభవ్‌ను ఔట్ చేశాను. దీనివల్ల మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామన్నాడు.

ప్రఫుల్ హింజ్ చారిత్రాత్మక అరంగేట్రం

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 24 ఏళ్ల హింజ్, తన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు (వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, లూహాన్‌డ్రే ప్రీటోరియస్ – ముగ్గురూ డక్‌లు) పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్‌లోనే మొదటి ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ప్రఫుల్ హింజ్ నిలిచాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 4 వికెట్లు (34 పరుగులు ఇచ్చి) పడగొట్టాడు. రెండో ఓవర్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ కూడా తీసి సంచలనం కొనసాగించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌ను 57 పరుగుల తేడాతో గెలుచుకుంది.

Exit mobile version