NTV Telugu Site icon

Rishabh Pant: అవన్నీ తప్పుడు వార్తలు.. అదే నిజమైతే పంత్ బతికేవాడు కాదు

Ajay Singh On Pant

Ajay Singh On Pant

Police Thrashes Fake News On Rishabh Pant Accident: ఓవైపు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తాగి నడపడం వల్లే అతని కారు ప్రమాదానికి గురైందంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. తాగిక మైకంలోనే పంత్ డివైడర్‌ని ఢీ కొట్టాడని, లేకపోతే ఈ ప్రమాదం సంభవించేదే కాదని చెప్తున్నారు. అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ, ఆ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ మద్య సేవించలేదని, అతడు తాగి కారు నడపలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలు స్పష్టం చేశారు. ఒకవేళ పంత్ తాగి కారు నడిపి ఉంటే.. అంత దూరం ఎలాంటి వస్తాడని తిరిగి ప్రశ్నించారు. యాక్సిడెంట్‌ జరిగినప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారన్నారు.

Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హరిద్వార్ సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మేము సుమారు 8, 10 స్పీడ్ కెమెరాల‌ను ప‌రిశీలించాం. ఒక‌వేళ పంత్ మ‌ద్యం సేవించి ఉంటే, ఢిల్లీ నుంచి 200 కి.మీ. దూరం ప్రయాణం చేసేవాడు కాదు. ప్రమాదం జరిగినప్పుడు పంత్ సాధార‌ణ స్థితిలోనే ఉన్నాడని, అతనికి ప్రాథ‌మిక చికిత్స అందించిన వైద్యుడు వెల్లడించాడు. పంత్ మ‌ద్యం సేవించ‌లేదు కాబ‌ట్టే.. కారులో నుంచి బయటకు రాగలిగాడు. నిజానికి.. తాగినవాళ్లు ఆ సమయంలో కారు నుంచి బయటకు రాలేరు. మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయేవారు. పంత్ తాగలేదు కాబట్టే, బయటకు వచ్చాడు. పైగా.. పంత్‌ను రక్షించిన బస్‌ డ్రైవర్‌తో కూడా పంత్‌ మాములుగానే మాట్లాడాడు. అది సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యింది. పంత్ తన కారుని 80 కిలోమీట‌ర్ల వేగ ప‌రిమితికి మించి నడపలేదు. బహుశా నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అయితే.. 80 కిమీ వేగంతో నడపడం వల్లే కారు గాల్లో పల్టీలు కొట్టింది’’ అని చెప్పారు.

Bhakthi Tv New Year Stothra Parayanam Live: న్యూ ఇయర్ మొదటి రోజున ఈ స్తోత్రాలు వింటే….

తమ టెక్నిక‌ల్ టీమ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారని, అక్కడ ఓవ‌ర్ స్పీడ్‌కు సంబంధించిన ఆధారాలు ఏవీ ల‌భించ‌లేదని అజయ్ సింగ్ తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. కాగా.. పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తీవ్ర గాయాలు అవ్వడంతో.. పంత్ కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో.. అతడు ఈ ఏడాది క్రికెట్ ఆడటం అనుమానాస్పదంగా మారింది.