Site icon NTV Telugu

PM Narendra Modi: సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధుకు ప్రధాని అభినందనలు

Pm Modi

Pm Modi

PM Narendra Modi: సింగపూర్ ఓపెన్-2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని మోదీ అభినందించారు.భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన వాంగ్ జియీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. “తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నందుకు పీవీ సింధును అభినందిస్తున్నాను. ఆమె మరోసారి తన అసాధారణమైన క్రీడా ప్రతిభను ప్రదర్శించి విజయం సాధించింది. ఇది దేశానికి గర్వకారణం, రాబోయే క్రీడాకారులకు కూడా స్ఫూర్తినిస్తుంది” అని ప్రధాని ట్వీట్ చేశారు.

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింగపూర్ ఓపెన్-2022 విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీని 21-9, 11-21, 21-15 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ప్రారంభసెట్‌ను సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. దీంతో 21-9తో తొలి సెట్‌ను సింధు గెలవగా రెండో సెట్‌ను 21-11 తేడాతో వాంగ్ జి యీ గెలిచింది. డిసైడర్ గేమ్‌లో అగ్రశ్రేణి భారత షట్లర్ 21-15తో విజయం సాధించి తొలిసారిగా సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది పీవీ సింధుకు ఇది మూడో టైటిల్. ఇప్పటికే 2022లో ఆమె కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్‌ టైటిళ్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Singapore Open: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం

సింగపూర్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం ఇక్కడ సింగపూర్‌లో జరిగిన సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన సైనా కవాకమిని ఓడించి పీవీ సింధు శిఖరాగ్ర పోరుకు చేరుకుంది. సింధు 15-21, 7-21తో రెండు వరుస గేమ్‌లలో జపాన్ క్రీడాకారిణిపై అధిగమించి ఆధిపత్యం సాధించింది. ఈ మ్యాచ్ 58 నిమిషాల పాటు సాగింది.

 

Exit mobile version