Site icon NTV Telugu

Pathum Nissanka: శ్రీలంక ‘సూపర్ స్టార్‌’ పాతుమ్ నిశాంక.. సంగా-సూర్య-జయ లాగే..!

Pathum Nissanka

Pathum Nissanka

Lanka’s New Superstar is Pathum Nissanka: అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుత ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ స్టార్ ప్లేయర్ ‘పాతుమ్ నిశాంక’. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో నిశాంక హాట్ టాపిక్‌గా మారాడు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే మూడు ఫార్మాట్లలో అద్భుత గణాంకాలు నమోదు చేసి.. భవిష్యత్తు దిగ్గజంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. శ్రీలంక దిగ్గజాలు సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే లాగే నిశాంక కూడా దిగ్గజ ప్లేయర్స్ అవుతాడని లంక మాజీలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

27 ఏళ్ల వయస్సులోనే పాతుమ్ టీ20, వన్డేలోనే కాదు.. టెస్టుల్లో కూడా నిరూపించుకున్నాడు. వన్డేల్లో ఇప్పటికే 2920 పరుగులు చేయగా.. 7 శతకాలు నమోదు చేశాడు. టీ20 అంతర్జాతీయాల్లో 2574 పరుగులతో పాటు 2 సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లోనూ 1305 పరుగులు, 4 శతకాలు నమోదు చేసి తన స్థిరత్వాన్ని చాటుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఇలాంటి స్థిరమైన ప్రదర్శన చేయడం యువ ఆటగాళ్లలో అరుదైన విషయం.

Also Read: Mitchell Marsh: ఇది అవమానకర ఓటమి, ఏడుపొచ్చేస్తోంది.. మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌కు పాతుమ్ నిశాంక ప్రధాన బలంగా మారాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చగల సామర్థ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. టెక్నిక్, సహనం, దూకుడు.. ఈ మూడు లక్షణాలు కలగలిపిన బ్యాటర్‌గా నిశాంకను క్రికెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. చిన్న వయస్సులోనే భారీ గణాంకాలు నమోదు చేస్తూ ముందుకు సాగుతున్న నిశాంక.. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు నిశాంక పేరు మార్మోగడానికి కారణం టీ20 ప్రపంచకప్‌ 2026లో సెంచరీ చేయడమే. ఓపెనర్‌ నిశాంక పటిష్ట ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో 100 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Exit mobile version