Pathum Nissanka Record: పాతుమ్ నిశాంక అరుదైన రికార్డు.. రెండో లంక బ్యాటర్‌గా..!
- టీ20 ప్రపంచకప్‌లో శతకం అంటే ఓ ప్రత్యేక ఘనత
- ఇప్పటివరకు కొందరు మాత్రమే శతకాలు బాదారు
- రెండో లంక బ్యాటర్‌గా నిశాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathum Nissanka Joins T20 Worldcup Centuries List: టీ20 ప్రపంచకప్‌లో శతకం సాధించడం అంటే ఓ ప్రత్యేక ఘనత. పొట్టి ఫార్మాట్లో బ్యాటర్లు దూకుడుగా ఆడినా.. సెంచరీ చేయడం చాలా కష్టం. ఏ క్షణంలో అయినా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సెంచరీ చేస్తే మాత్రం అత్యంత అరుదైన విషయం అవుతుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతోంది. ఇప్పటివరకు కొందరు మాత్రమే శతకాలు చేశారు. 2007 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎడిషన్లలో కొద్ది మంది మాత్రమే ఈ ఘనత సాధించి.. తమ పేరును రికార్డుల్లో నిలిపారు. ఆ జాబితాను ఓసారి చూద్దాం.
2026 ఎడిషన్‌లో శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిశాంక ఆస్ట్రేలియాపై అజేయంగా 100 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ సెంచరీతో నిశాంక ప్రపంచకప్‌లో శతకం చేసిన రెండో లంక బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు దిగ్గజ బ్యాటర్ మహేళ జయవర్ధనే సెంచరీ (100) చేశాడు. 2010లో మహేళ జింబాబ్వేపై శతకం (100) చేశాడు. 2022 టోర్నీలో కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ శ్రీలంకపై 104 పరుగులు, దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రోసోవ్ బంగ్లాదేశ్‌పై 109 పరుగులతో మెరిశారు. 2021లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ శ్రీలంకపై అజేయంగా 101 పరుగులు చేశాడు.
Also Read
- Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
- Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
- Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
2016లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇంగ్లండ్‌పై సెంచరీ (100) చేయగా.. ఒమన్‌పై బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 103 పరుగులతో ఆకట్టుకున్నాడు. 2014 ఎడిషన్‌లో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ బంగ్లాదేశ్‌పై శతకం (111 నాటౌట్) బాదగా.. ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ శ్రీలంకపై సెంచరీ (116 నాటౌట్) చేశాడు. 2012లో కివీస్ మాజీ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ బంగ్లాదేశ్‌పై 123 పరుగులతో రెచ్చిపోయాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే.
Also Read: Sri Lanka-T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రయాణం.. లంకేయులు ఎప్పుడూ పోటీదారులే!
2010లో మహేళ జయవర్ధనే జింబాబ్వేపై సెంచరీ (100) చేయగా.. టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా దక్షిణాఫ్రికాపై (101) సెంచరీ చేశాడు. ఇక తొలి ఎడిషన్ 2007లోనే క్రిస్ గేల్ దక్షిణాఫ్రికాపై 117 పరుగులు చేసి.. టీ20 ప్రపంచకప్ తొలి సెంచరీ హీరోగా నిలిచాడు. ఈ జాబితా చూస్తే.. టీ20 ఫార్మాట్ ఎంత వేగవంతమైనదైనా, పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారనే విషయం స్పష్టమవుతోంది. తాజా ఎడిషన్‌లో నిస్సాంక ప్రదర్శనతో మరోసారి ఈ లిస్ట్ చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
OG 2 Update: చేతులు మారిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’!
-
Reliance AGM 2026: జియో IPO నుంచి AI, 2 లక్షల ఉద్యోగాల వరకు.. ముఖేష్ అంబానీ 10 కీలక ప్రకటనలు
-
Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
-
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!