Site icon NTV Telugu

Pat Cummins Yorker: ప్యాట్‌ కమ్మిన్స్‌ సూపర్‌ యార్కర్‌.. ఇంగ్లండ్ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్

Pat Cummins Yorker

Pat Cummins Yorker

Pat Cummins Bolds Ollie Pope with Stuning Yorker in Ashes 2023 1st Test: ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేస్, బౌన్స్, స్వింగ్‌, యార్కర్‌లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతాడు. ఇక పేస్ పిచ్ అయితే అతడు మరింత చెలరేగుతాడు. యార్కర్‌లతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. మేటి బ్యాటర్ కూడా కమ్మిన్స్‌ బౌలింగ్ ముందు తేలిపోతాడు. కమ్మిన్స్‌ పేస్ పిచ్‌పై తానెంత ప్రమాదకారో మరోసారి చూపెట్టాడు. ఓ సూపర్‌ యార్కర్‌తో ఇంగ్లండ్ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌ చేశాడు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యాషెస్‌ 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ సూపర్ బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ను అడ్డుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లీష్ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను ఓ సూపర్ యార్కర్‌తో బోల్తా కొట్టించాడు. 17వ ఓవర్లోని చివరి బంతిని 139 కిమీ వేగంతో కమ్మిన్స్‌ యార్కర్‌ వేయగా.. పోప్‌ వద్ద సమాధానమే లేదు. అతడు బ్యాట్ అడ్డుపెట్టేలోపే బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో పోప్‌ మైండ్‌ ఒక్కసారిగా బ్లాంక్‌ అయింది.

Also Read:
Suraj Randiv Bus Driver: ఎంఎస్ ధోనీతో ఆడాడు.. ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడు! ఇప్పుడు మాత్రం బస్‌ డ్రైవర్‌
ప్యాట్‌ కమ్మిన్స్‌ యార్కర్‌కు బలైన ఓలీ పోప్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అతడు 14 పరుగులు నిరాశపరిచాడు. కమ్మిన్స్‌ యార్కర్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. చివరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్‌ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది. దాంతో ఫాన్స్ అందరూ చివరి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

 

https://twitter.com/ZohaibKashiff/status/1670770822829465600

Exit mobile version