Pat Cummins-SRH: ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు శుభవార్త.. పాట్ కమిన్స్ రాకకు టైమ్ ఫిక్స్!
- ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు శుభవార్త
- పాట్ కమిన్స్ రాకకు టైమ్ ఫిక్స్
- టోర్నీ రెండో భాగంలో మైదానంలోకి కమిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అభిమానులకు శుభవార్త. కొంతకాలంగా వెన్ను గాయంతో (బ్యాక్ ఇంజరీ) ఇబ్బందిపడుతున్న ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేగంగా కోలుకుంటున్నాడు. మార్చి 25న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన జట్టు ట్రైనింగ్ సెషన్‌లో కమిన్స్ పాల్గొన్నాడు. ఇది అభిమానులకు ఊరటనిచ్చే అంశం. తాను వేగంగా కోలుకుంటున్నానని, 2026 ఐపీఎల్ మధ్యలో జట్టులోకి వస్తానని కమిన్స్ చెప్పాడు. అంతా అనుకున్నట్లు జరిగితే తాను టోర్నీ రెండో భాగం, ఫైనల్స్‌లో మైదానంలోకి దిగుతానని చెప్పుకొచ్చాడు.
బ్యాక్ ఇంజరీ సమస్యతో బాధపడుతున్న పాట్ కమిన్స్ ఎస్‌ఆర్‌హెచ్ ట్రైనింగ్‌లో తేలికపాటి వర్కౌట్‌కే పరిమితమయ్యాడు. వార్మప్ ఎక్సర్‌సైజ్‌లు, ఫీల్డింగ్, క్యాచింగ్ డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. అలాగే తక్కువ రన్‌అప్‌తో కొన్ని బంతులు వేసి తన బౌలింగ్ రిథమ్‌ను తిరిగి అందుకోవడానికి ప్రయత్నించాడు. ఇది కమిన్స్ రికవరీ సానుకూల దిశలో సాగుతున్నట్లు సూచిస్తోంది. ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్ అయిన కమిన్స్.. గత ఏడాది నుంచి గాయాల కారణంగా కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వెస్టిండీస్ టూర్ అనంతరం లంబార్ స్ట్రెస్ ఇంజరీ కారణంగా చాలా కాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌పై అడిలైడ్ టెస్ట్ మాత్రమే ఆడగా.. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడలేదు.
Also Read
- Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
- India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
- KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
- Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
Also Read: Vaani Kapoor: టూ పీస్ అవుట్ ఫిట్‌లో రచ్చ.. సమ్మర్‌ను మరింత హీట్ ఎక్కిస్తోన్న వాణీ!
ఐపీఎల్ 2026 గురించి పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తాను ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోనని స్పష్టం చేశాడు. అయితే టోర్నమెంట్ మధ్యలో తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రతి మూడు రోజులకు ఒకసారి బౌలింగ్ చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నానని తెలిపాడు. ప్లాన్ ప్రకారం మిడ్ సీజన్ నాటికి మైదనంలోకి దిగుతా అని ధీమా వ్యక్తం చేశాడు. కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రారంభ మ్యాచ్‌ల్లో కిషన్ నాయకత్వం కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
-
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
-
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
-
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!