NTV Telugu Site icon

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..

Modi Chicha

Modi Chicha

Paris Olympics 2024: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం జరిగిన ఓపెనింగ్ వేడుకతో అధికారికంగా ప్రారంభమైయ్యాయి. ఇక, పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. భారత్‌లోని ప్రతి క్రీడాకారుడు దేశానికి గర్వకారణం.. వారందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాను అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాసుకొచ్చారు. ఇక, 117 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొనే క్రీడల మహాకుంభ్ ఫ్రాన్స్ రాజధానిలో నేటి నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది.

Read Also: Prashanth Varma: సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్న స్టార్ దర్శకుడు..ఎవరో తెలుసా..?

కాగా, ప్రసిద్ధ సెయిన్ నదిపై ఈ క్రీడలు ప్రారంభోత్సవం జరిగింది. ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం స్టేడియంలో కాకుండా నదిపై నిర్వహించడం ఇదే మొదటిసారి. భారతీయ క్రీడకారుల బృందం కూడా ఇందులో పాల్గొంది. ఇక, టోక్యో ఒలింపిక్స్-2020 కంటే భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని అందరు భావిస్తున్నారు. హాకీ, షూటింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో భారత క్రీడాకారులు నేటి నుంచి పోటీపడుతున్నారు. అయితే, ప్రారంభ వేడుకల్లో కొందరు భారత ఆటగాళ్లు కనిపించలేదు. వారి షెడ్యూల్‌లను పరిగణలోకి తీసుకుని.. ప్రారంభ వేడుకల్లో కేవలం 78 మంది క్రీడాకారులు, 12 మంది అధికారులు మాత్రమే పాల్గొన్నారు.