ఈ ఏడాది ఆసియా కప్ వివాదం కొద్దిరోజుల క్రితమే సద్దుమణిగిందని అనుకుంటున్న ప్రతీసారి ఇది రావణకాష్టంలా రగులుతూనే ఉంది. భద్రతా కారణాల నేపథ్యంలో తాము పాకిస్తాన్ కు రాబోమని.. తటస్థ వేదికలపై అయితేనే ఆసియా కప్ ఆడతామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తేల్చి చెప్పింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చినా పాకిస్తాన్ క్రికెట్ లో మాత్రం ఈ వివాదం కొనసాగుతునే ఉంది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)మాజీ సీఈవో, ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మేనేజర్ ఆఫ్ క్రికెట్ వసీం ఖాన్ సంచలన వ్యాఖ్యలతో మళ్లీ వివాదం చెలరేగుతుంది.
Also Read : Amritpal Singh: స్వర్ణ దేవాలయం వద్ద లొంగిపోనున్న అమృత్ పాల్ సింగ్.. సిక్కులు యూనిటీ ఉండాలని వీడియో
ఆసియా కప్ నిర్వహణ వివాదం గురించి చర్చ జరుగుతున్న వేళ పాకిస్తాన్ లోని స్థానికంగా ఉన్న ఓ టీవీ ఛానెల్ తో వసీం ఖాన్ ఈ కామెంట్స్ చేశాడు. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్ కు రాకుండా తటస్థ వేదికలపైనే ఆడతామని చెబుతుంటూ తాము మాత్రం వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్లేది లేదని, తాము ఆడే మ్యాచ్ లకూ న్యూట్రల్ వేదికలు కావాలని డిమాండ్ చేశారు. వసీం ఖాన్ వ్యాఖ్యలకు తోడు ఆసియా కప్ నిర్వహణ వివాదంపై గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ ఆటగాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇండియన్ టీమ్ పాకిస్తాన్ కు వచ్చేందుకు వణుకు పుడుతుందని పాక్ మాజీ ఓపెనర్ ఇమ్రాన్ నజీర్ కామెంట్స్ చేశాడు.
Also Read : Rahul Gandhi: ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలతో అనర్హుడయ్యాడో.. అక్కడి నుంచే రాహుల్ ప్రచారం..
అసలు విషయం చెప్పకుండా భద్రత లోపం అంటూ కుంటి సాకులు చెబుతుందంటూ ఇమ్రాన్ నజీర్ విమర్శించాడు. ఇదిలా ఉండగా ఈ వివాదం మొదలైన కొత్తలో పీసీబీ కూడా ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్ కు రాకుంటే మేం కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు రాబోము అంటూ హెచ్చరించింది. దీనిపై గతంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. పాకిస్తాన్ రాకున్న వన్డే వరల్డ్ కప్ కు ఏ లోటూ ఉండదని భారత్ కు వచ్చిన దేశాలతోనే ఈ టోర్నీని ఘనంగా నిర్వహిస్తామని అనురాగ్ ఠాకూర్ అన్నారు.