Asia Cup 2022: ఆసియా కప్ విషయంలో పురుషుల బాటలోనే టీమిండియా మహిళలు పయనించారు. ఇటీవల జరిగిన సూపర్-4లో విభాగంలో పాకిస్థాన్‌పై ఓటమి చెంది టోర్నీ నుంచి టీమిండియా తప్పుకుంది. తాజాగా మహిళల ఆసియా కప్‌లోనూ టీమిండియాకు చేదు ఫలితం ఎదురైంది. టీమిండియాపై పాకిస్థాన్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పాకిస్థాన్ జట్టును నిదా దార్, కెప్టెన్ మరూఫ్ ఆదుకున్నారు. నిదా దార్ 37 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. మరూఫ్35 బంతుల్లో 32 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు 3 వికెట్లు దక్కాయి.
Read Also: Lionel Messi: సంచలన ప్రకటన.. త్వరలోనే రిటైర్మెంట్
అనంతరం 137 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 19.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (26) టాప్ స్కోరర్. ఓపెనర్ స్మృతి మంధాన (17), హర్మన్ ప్రీత్ కౌర్ (12), పూజా వస్త్రాకర్ (5), హేమలత (20) విఫలమయ్యారు. పాకిస్థాన్బౌలర్లలో నశరా సంధు మూడు వికెట్లు, నిదా దార్, సాదియా ఇక్బాల్ రెండు వికెట్లు, తుబా హసన్, ఐమాన్అన్వర్ చెరోవికెట్ తీశారు. అంతకుముందు వరుసగా శ్రీలంక సహా యూఏఈ, మలేషియా వంటి జట్లపై విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన భారత్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రం ఘోరంగా విఫలం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
