Site icon NTV Telugu

Michael Clarke: పాకిస్తాన్ ఘోర ఓటమికి అదే కారణం.. ఆసీస్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..

Ind Vs Pak

Ind Vs Pak

Michael Clarke: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దాయాది ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. పాకిస్తాన్ ఓటమి సొంత దేశం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు, పాక్ మాజీలు ఆటగాళ్లపై విరుచుకుపడుతున్నారు. ఏ దశలో కూడా టీమిండియాకు పోటీ ఇవ్వలేదని బాబర్, షాహీన్ అఫ్రిది వంటి ఆటగాళ్లపై ఫైర్ అవుతున్నారు.

Read Also: Kyathanpalli High Tension: క్యాతనపల్లిలో పొలిటికల్ వార్.. చైర్మన్ ఎన్నిక వాయిదా.. మళ్ళీ క్యాంపులకు కౌన్సిలర్లు..!

పాకిస్తాన్ ఓటమికి కేవలం ఆటగాళ్లు మాత్రమే బాధ్యులు కాదని, ప్రభుత్వం, బోర్డు కూడా కారణమే అని చాలా మంది చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాక్ ‘‘బాయ్‌కాట్ డ్రామా’’ ఆడిందని ఆరోపిస్తున్నారు. ముందుగా భారత్‌తో మ్యా్చ్‌ను బహిష్కరిస్తామని పాక్ చెప్పింది. ఆ తర్వాత యూ-టర్న్ తీసుకుంది.

పాక్ ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించారు. ‘‘భారత్, పాక్ మధ్య స్పష్టమైన అంతరం ఉంది. టీ20 ఫార్మాట్‌లో భారత్ చాలా ముందుంది. పీఎస్ఎల్ నుంచి పాక్ కొత్త టాలెంట్‌ను తీసుకోవాలి. పాకిస్తాన్ సీనియర్ల యుగం ముగిసే అవకాశం ఉంది’’ అని ఆయన అన్నారు. పాక్ ఓటమికి ‘‘బాయ్ కాట్ సర్కస్’’ కూడా ఒక కారణమని అన్నారు. బాయ్‌కాట్ చేస్తామని ముందు చెప్పి, యూ టర్న్ తీసుకోవడం కూడా ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీశాయని చెప్పారు.

Exit mobile version