Pakistan vs Afghanistan: స్టేడియంలో ఫ్యాన్స్ మధ్య గొడవ.. కుర్చీలు విరగ్గొట్టి మరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan and Afghanistan Fans Fight At Sharjah Stadium After Pak Beats Afghan: ఆసియా కప్‌లో భాగంగా సూపర్ 4లో నిన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి.. ఆసిఫ్ అలీ (పాక్), ఫరీద్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్) మధ్య గొడవ. ఫరీద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాక ఆసిఫ్ అలీ పెవిలియన్ చేరుతున్నప్పుడు, ఔట్ చేసిన జోష్‌లో ఫరీద్ అతనికి చాలా దగ్గరికి వెళ్లి తాను వికెట్ తీశానన్నట్టుగా సంజ్ఞ చేశాడు. అది నచ్చక అలీ కోపంతో అతడ్ని వెనక్కు నెట్టాడు. అంతటితో ఆగకుండా బ్యాటుతో కొట్టడానికి వెళ్లాడు. ఇక్కడ అలీ తీరు ముమ్మాటికీ తప్పు. అఫ్‌కోర్స్, మొదట్లో రెచ్చగొట్టింది ఫరీద్ అయినప్పటికీ, బ్యాటుతో దాడి చేయడానికి యత్నించడమన్నది ఆమోదయోగ్యం కాదు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల ఎలా ప్రవర్తించాలో అలీ నేర్చుకోవాలి.
ఇక రెండోది.. ఫ్యాన్స్ మధ్య గొడవ. బహుశా.. మైదానంలో ఆసిఫ్ అలీ ప్రవర్తనతో నొచ్చుకున్నారో లేక తమ జట్టుని పాకిస్తాన్ ఓడించిందనో తెలీదు కానీ, ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు మాత్రం ఒక్కసారిగా పాక్ ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. మైదానంలోని కుర్చీలు విరగ్గొట్టి మరీ, ఎటాక్ చేశారు. అటు.. పాక్ ఫ్యాన్స్ కూడా ఎదురు దాడికి దిగారు. వాళ్లూ ఎటాక్ చేశారు. ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోయబ్ అఖ్తర్ సైతం వీడియో షేర్ చేసి.. క్రికెట్ ఒక ఆట మాత్రమేనని, దీన్ని రైట్ స్పిరిట్‌లో తీసుకోవాలే గానీ ఇలా దాడులకు దిగకూడదని అన్నాడు. కానీ.. అలీ ప్రవర్తనపై మిన్నకుండిపోయి, ఆఫ్ఘన్ వాళ్లకు హితబోధ చేయడమేంటి అఖ్తర్..?
Also Read
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
This is what Afghan fans are doing.
This is what they've done in the past multiple times.This is a game and its supposed to be played and taken in the right spirit.@ShafiqStanikzai your crowd & your players both need to learn a few things if you guys want to grow in the sport. pic.twitter.com/rg57D0c7t8— Shoaib Akhtar (@shoaib100mph) September 7, 2022
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!