Site icon NTV Telugu

Pakistan vs Afghanistan: స్టేడియంలో ఫ్యాన్స్ మధ్య గొడవ.. కుర్చీలు విరగ్గొట్టి మరీ..

Pak Vs Afghan Fans Fight

Pak Vs Afghan Fans Fight

Pakistan and Afghanistan Fans Fight At Sharjah Stadium After Pak Beats Afghan: ఆసియా కప్‌లో భాగంగా సూపర్ 4లో నిన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి.. ఆసిఫ్ అలీ (పాక్), ఫరీద్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్) మధ్య గొడవ. ఫరీద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాక ఆసిఫ్ అలీ పెవిలియన్ చేరుతున్నప్పుడు, ఔట్ చేసిన జోష్‌లో ఫరీద్ అతనికి చాలా దగ్గరికి వెళ్లి తాను వికెట్ తీశానన్నట్టుగా సంజ్ఞ చేశాడు. అది నచ్చక అలీ కోపంతో అతడ్ని వెనక్కు నెట్టాడు. అంతటితో ఆగకుండా బ్యాటుతో కొట్టడానికి వెళ్లాడు. ఇక్కడ అలీ తీరు ముమ్మాటికీ తప్పు. అఫ్‌కోర్స్, మొదట్లో రెచ్చగొట్టింది ఫరీద్ అయినప్పటికీ, బ్యాటుతో దాడి చేయడానికి యత్నించడమన్నది ఆమోదయోగ్యం కాదు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల ఎలా ప్రవర్తించాలో అలీ నేర్చుకోవాలి.

ఇక రెండోది.. ఫ్యాన్స్ మధ్య గొడవ. బహుశా.. మైదానంలో ఆసిఫ్ అలీ ప్రవర్తనతో నొచ్చుకున్నారో లేక తమ జట్టుని పాకిస్తాన్ ఓడించిందనో తెలీదు కానీ, ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు మాత్రం ఒక్కసారిగా పాక్ ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. మైదానంలోని కుర్చీలు విరగ్గొట్టి మరీ, ఎటాక్ చేశారు. అటు.. పాక్ ఫ్యాన్స్ కూడా ఎదురు దాడికి దిగారు. వాళ్లూ ఎటాక్ చేశారు. ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోయబ్ అఖ్తర్ సైతం వీడియో షేర్ చేసి.. క్రికెట్ ఒక ఆట మాత్రమేనని, దీన్ని రైట్ స్పిరిట్‌లో తీసుకోవాలే గానీ ఇలా దాడులకు దిగకూడదని అన్నాడు. కానీ.. అలీ ప్రవర్తనపై మిన్నకుండిపోయి, ఆఫ్ఘన్ వాళ్లకు హితబోధ చేయడమేంటి అఖ్తర్..?

Exit mobile version