Site icon NTV Telugu

Team India Sponsors: ఆన్‌లైనింగ్‌ గేమింగ్‌ బిల్లు ఎఫెక్ట్.. బీసీసీఐకి రూ.125 కోట్లు, ప్లేయర్స్ కు తీవ్ర నష్టం

Dream 11

Dream 11

Team India Sponsors: పార్లమెంట్‌లో ఆన్‌లైనింగ్‌ గేమింగ్‌కు సంబంధించి బిల్లు ఉభయ సభల్లో పాస్ అయింది. డబ్బులతో ముడిపడిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిర్వహణను నిషేధించే కీలక బిల్లుకు ఆమోదం లభించడంతో.. అన్ని రకాల మనీ గేమ్‌లపై నిషేధం పడినట్లైంది. గత కొన్ని రోజుల పాటు టీమిండియా క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న డ్రీమ్ 11 వైదొలిగింది. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్‌ 2025 మొదలుకానుంది. ఆలోపు కొత్త స్పాన్సర్‌ను బీసీసీఐ వెతికి పట్టుకోవాలి. లేకపోతే ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాగా, ఇప్పటికే స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడంతో రూ.125 కోట్ల మేర నష్టపోయే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. కేవలం బోర్డు పైనే కాకుండా ప్లేయర్స్ పై కూడా దీని ఎఫెక్ట్ తప్పదని న్యూస్ వినిపిస్తుంది.

Read Also: Robbery in Narsapur Express: రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్.. నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

ఇక, డ్రీమ్‌ 11 గేమింగ్ యాప్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్య సోదరులతో కాంట్రాక్ట్‌ చేసుకుంది. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సౌరభ్ గంగూలీ మై11 సర్కిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్ కోహ్లీ అయితే ఎంపీఎల్‌ను ప్రమోట్ కూడా చేశాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా విన్‌జోతో టైఅప్ అయ్యాడు. కానీ, ఒక్కొక్కరికి ఫీజు వేర్వేరుగా ఉంటుంది.

Read Also: Case Filed On TVK Chief: నటుడు విజయ్కి షాక్.. కేసు పెట్టిన పోలీసులు..

అయితే, విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ ప్రకారం ఏడాదికి రూ.12 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. సంవత్సరానికి రోహిత్, ధోనీ రూ.7 కోట్ల చొప్పున అందుకుంటున్నారు. అలాగే, యువ క్రికెటర్లకూ కనీసం రూ.కోటికి తక్కువ కాకుండా అందజేస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ అందరికి కలిపి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ ఇలాంటి కాంట్రాక్ట్ నుంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు నిషేధం విధించడంతో వీరిపై తీవ్ర ప్రభావం పడనుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Modi-Rabuka: ఎవరో మీతో సంతోషంగా లేరు.. మోడీతో ఫిజీ ప్రధాని వ్యాఖ్య

కాగా, ఆన్‌లైనింగ్‌ గేమింగ్‌ బిల్లు కేవలం భారత క్రికెట్ బోర్డు, ప్లేయర్ల మీదనే కాకుండా.. ఐపీఎల్ ఫ్రాంచైజీల పైనా తీవ్ర ప్రభావం చూపించనుంది. కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తదితర జట్లకు స్పాన్సర్లుగా గేమింగ్‌ యాప్‌లే ఉన్నాయి. కొందరు ఆటగాళ్లు తమ ఎండార్స్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియోలో చాలా తక్కువ కాంట్రాక్ట్‌లు ఉన్నప్పటికీ.. ఎక్కువ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తున్నారు.

Exit mobile version