Site icon NTV Telugu

ODI WC: వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ షెడ్యూల్‌..

World Cup

World Cup

వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్‌ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ర్యాంకింగ్స్‌లో పడిపోయిన మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లు ఈసారి క్వాలిఫయర్స్‌ ద్వారా ప్రధాన టోర్నీకి ముందడుగు వేయాల్సి ఉంటుంది. వచ్చేనెల ( జూన్ ) 18 నుంచి జూలై 9 వరకు జింబాబ్వేలో క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్ జరుగుతుంది. ప్రధాన టోర్నీకి కేవలం రెండు బెర్త్‌లే ఖాళీ ఉన్నాయి. అయితే.. మొత్తం 10 జట్లు అర్హత టోర్నీలో పాల్గొంటాయి. గ్రూప్‌ ‘ఎ’లో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా ఉండగా.. గ్రూప్‌ ‘బి’లో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ లీగ్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫైనల్స్‌కు చేరే రెండు జట్లు అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి.

Also Read : MS Dhoni: సీఎస్కేకి బిగ్ షాక్.. ధోనీపై నిషేధం?

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ తొలి మ్యాచ్ జూన్ 18న వెస్టిండీస్, యూఎస్ఏ మధ్య జరుగుతుంది. ఇక జూన్ 19 శ్రీలంక, యూఏఈ మధ్య జరగనుంది. ఇప్పటికే ఇండియా సహా 8 టీమ్స్ నేరుగా వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించాయి. ఈ టోర్నీ అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్ లో జరుగనున్నాయి. క్వాలిఫయర్స్ నుంచి రెండు టీమ్స్ వరల్డ్ కప్ ప్రధాన టోర్నీకి వెళ్లనుండటంతో మొత్తం పది జట్లు.. ఆ మెగా టోర్నీలో ట్రోఫీ కోసం తలపడతాయి. ఇప్పటికే ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. అయితే మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంకల భవితవ్యం ఈ క్వాలిఫయర్స్ లో తేలనుంది.

Also Read : K. Laxman: ధన్యవాద్ మోడీ పేరుతో సమ్మేళన సదస్సులు.. ఓబీసీ మోర్చా నిర్ణయం

Exit mobile version