టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం… జకోవిచ్ వీసాను రెండోసారి రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ టెన్నీస్ స్టార్‌పై మూడేళ్లపాటు నిషేధం విధించింది ఆసీస్.. కరోనా నిబంధనలు పాటించనందుకు వీసా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఇటీవలే మెల్‌బోర్న్ వెళ్లారు జకోవిచ్.. అయితే, అనూహ్యంగా ఎయిర్‌పోర్ట్ నుంచే జకోవిచ్‌కు వెనక్కి పంపించారు అధికారులు.. తాజాగా, మరోసారి వీసాను రద్దు చేయడంతో.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది..
Read Also: 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 1న బడ్జెట్..
కోవిడ్ -19 వ్యాక్సిన్ లేకుండా దేశానికి వచ్చిన తర్వాత టెన్నిస్ సూపర్ స్టార్‌ను బహిష్కరించాలని కోరడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం శుక్రవారం రెండోసారి నోవాక్ జకోవిచ్ వీసాను రద్దు చేసింది. ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.. ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ప్రభుత్వం ఆస్ట్రేలియా సరిహద్దులను రక్షించడానికి దృఢ సంకల్పంతో ఉందన్న ఆయన.. ముఖ్యంగా కోవిడ్ 19 మహమ్మారికి సంబంధించి అన్నారు.. ఈ రద్దు ప్రభావం కొన్ని పరిస్థితుల్లో మినహా, మూడు సంవత్సరాల పాటు కొత్త ఆస్ట్రేలియన్ వీసా నుండి జకోవిచ్ నిషేధించబడతాడు.. వీసాపై ఆస్ట్రేలియాతో తేల్చేయడంతో ఈ టెన్నీస్ స్టార్ 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కలతో పాటు రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్‌ను సాధించాలన్న తన లక్ష్యం కూడా ప్రమాదంలో పడిపోయింది.