31 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు.. 1న బడ్జెట్‌..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు సమయం ఆసన్నమైంది.. కేంద్ర బడ్జెట్‌ 2022-23 ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.. ఈ సారి కూడా రెండు విడతలుగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు.. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు మొదటి విడత బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్ సెషన్‌ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.. ఇక, కేంద్ర బడ్జెట్ 2022-23ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 8వ తేదీన ముగియనున్నాయి.. సెషన్ యొక్క మొదటి భాగం ఫిబ్రవరి 11న ముగుస్తుంది. ఒక నెల రోజుల విరామం తర్వాత, సెషన్ యొక్క రెండో భాగం మార్చి 14 నుండి ప్రారంభమై ఏప్రిల్ 8న ముగియనుంది.

Read Also: కరోనా కల్లోలం.. 32 కోట్లు దాటిన పాజిటివ్‌ కేసులు

Related Articles

Latest Articles