ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.. అక్కడి నిబంధనల ప్రకారం.. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనుదిరగాల్సి వచ్చింది.. న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు.. చివరకు జకోవిచ్ వీసాపై కూడా వ్యాన్ విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం దీంతో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనాలనుకున్న జకోవిచ్ కలలు ఆవిరయ్యాయి.. అయితే.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేకపోతే ఏంటి.. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశాలు మెండిగా కనిపిస్తున్నాయి.
Read Also: శుభవార్త.. భారీగా తగ్గనున్న వ్యాక్సిన్ ధరలు..!
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విరుచుకుపడుతుండగా.. ఫ్రాన్స్ లో మాత్రం అదుపులోకి వచ్చింది.. దీంతో.. అక్కడి ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలను సడలించేందుకు సిద్ధం అవుతోంది.. 6 నెలల క్రితం పాజిటివ్ వచ్చిన వారు ఫ్రాన్స్‌లో ఎంట్రీకి తప్పనిసరి వ్యాక్సిన్ పాస్ చూపాల్సిన అవసరం లేదని ఫ్రాన్స్ ప్రకటించింది.. దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో జకోవిచ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టు అయ్యింది.. మొత్తంగా వ్యాక్సిన్ నిబంధనల కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైన జకోవిచ్.. ఇప్పుడు వ్యాక్సిన్ లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగే ఛాన్స్ వచ్చేసిందన్నమాట.