Site icon NTV Telugu

Novak Djokovic : వింబుల్డన్‌లో శత విజయాలతో చరిత్ర సృష్టించిన జకోవిచ్

Novak Djokovic

Novak Djokovic

లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ లో మరో సంచలనం నమోదైంది.టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ 100 విజయాలు సాధించిన 3వ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ ప్రస్తుతం తన 20వ వింబుల్డన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. సెర్బియాకు చెందిన జకోవిచ్ తన తోటి దేశస్తుడైన కెమనోవిచ్ పై వరుస సెట్లలో గెలిచి, ఈ ఘనత సాధించాడు.ఆ మ్యాచ్లో కెమనోవిచ్ పై 6-3,6-0,6-4 తేడాతో విజయం అందుకున్నాడు.కాగా నొవాక్ జకోవిచ్ కంటే ముందు మార్టినా నవ్రతిలోవా, రోజర్ ఫెదరర్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.

Kingdom : వాయిదాలకు గుడ్‌బై.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఇదిలా ఉండగా మహిళల విభాగంలో 9 సార్లు వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియన్ మార్టినా నవ్రతిలోవా 120 సింగిల్స్ మ్యాచ్లు గెలవగా.. మెన్స్ సింగిల్స్ విభాగంలో, రోజర్ ఫెదరర్ 105 సింగిల్స్ మ్యాచ్‌లలో విజయం సాధించాడు. అంతే కాదు రోజెర్ ఫెదరర్ 8 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచాడు.

తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 428 వారాలుగా ATP ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న నొవాక్ జకోవిట్.. ఇప్పుడు తన 8వ వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి రోజర్ ఫెదరర్ రికార్డు టైటిళ్లను సమం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ ఈ ట్రోఫీని గెలిస్తే ఓపెన్ ఎరాలో పురుషుల ‘మేజర్’ సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన అతి పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తాడు. ika గత నెలలో జరిగిన రోనాల్డ్ గారోస్ లో నొవాక్ జకోవిచ్ క్లే-కోర్టులో తన 100వ మ్యాచ్ విజయాన్ని సాధించాడు.

HebahPatel : అబ్బా.. హెబ్బా.. బ్లాక్ డ్రెస్ లో ఏముందబ్బా..

Exit mobile version