NTV Telugu Site icon

IPL: రేపే ఐపీఎల్‌ సీజన్‌ స్టార్ట్.. ఉగ్రముప్పుపై స్పందించిన పోలీసులు…

రేపు ఐపీఎల్‌-15 వ సీజన్‌ ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై-కోల్‌కతా మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే ఉగ్రవాదులు ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌లను టార్గెట్ చేసినట్లు సమాచారం. క్విక్ రెస్పాన్స్‌ బాంబ్‌ స్వ్కాడ్‌ టీం ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. మరోవైపు, ఐపీఎల్ 2022కి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు లేవని ముంబై పోలీసులు తెలిపారు.. మార్చి 26 నుంచి నగరంలో జరగనున్న IPL-2022 క్రికెట్ మ్యాచ్‌లకు ఉగ్రవాద బెదిరింపులు ఉన్నట్లు.. ఎలాంటి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు లేదా సమాచారం అందలేదని ముంబై పోలీసులు గురువారం వెల్లడించారు.

Read Also: KTR US Tour: హైదరాబాద్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన బోస్టన్ సిటీ..

IPL మ్యాచ్‌లు జరిగే ప్రదేశాలు లేదా ఆటగాళ్లు బస చేసే హోటళ్లలో టెర్రర్ గ్రూపులు రెక్సీ నిర్వహించి, టోర్నమెంట్‌కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని కొన్ని మీడియా విభాగాలలో వచ్చిన వార్తలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ లట్కర్ ఖండించారు. హోటల్ ట్రైడెంట్, వాంఖడే స్టేడియం మరియు రెండు ప్రదేశాల మధ్య (సుమారు 1.5 కి.మీ) మార్గంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.. హోటలు, స్టేడియం మరియు మార్గాన్ని ముట్టడించే ప్రణాళికలతో టెర్రర్ గ్రూపులు రెక్సీ నిర్వహించాయని కొన్ని మీడియా నివేదికలు ముందు రోజు పేర్కొన్నాయి.. అయితే ముంబై పోలీసులు అధికారికంగా స్థితిని స్పష్టం చేశారు మరియు అలాంటి అవకాశాన్ని తోసిపుచ్చారు. ఇక, తొలి మ్యాచ్‌ చెన్నై-కోల్‌కతా మధ్య తొలి మ్యాచ్‌ జరగనుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న విషయం తెలిసిందే.. సారథ్య బాధ్యతలను జడేజాకు అప్పగిస్తున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ప్లేయర్‌, వికెట్ కీపర్‌గా ధోనీ… కొనసాగుతాడని చైన్నై యాజమాన్యం ప్రకటించింది. ధోని కెఫ్టెన్సీలో సీఎస్కే నాలుగుసార్లు టైటిల్‌ గెలుచుకుంది. 2008 నుంచి చెన్నైకు కెఫ్టెన్‌ వ్యవహారిస్తున్నాడు. మరీ జడేజా సారథ్యంలో సీఎస్కే ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.