Nitish Rana Hrithik Shokeen Fined For Breaking Rules: క్రికెటర్లు అప్పుడప్పుడు యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ.. గొడవలకు దిగుతుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా, ముంబై ఇండియన్స్ ప్లేయర్ హృతిక్ రోషన్‌లు కూడా అలాగే గొడవ పడ్డారు. బౌలింగ్ వేసిన అనంతరం హృతిక్ నడుచుకుంటూ నితీశ్ వైపుకు వెళ్లాడు. నితీశ్ తనవైపుకు చూసినప్పుడు.. అతనికి ఎదురుగా కొట్టినట్టు వచ్చాడు. ఇంకేముంది.. ఇగో హర్ట్ అవ్వడంతో ఇద్దరు పరస్పర దూషణలకు దిగారు. అనుచితంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నిర్వాహకులు ఆ ఇద్దరికీ జరిమానా విధించారు.
Hardik Pandya: హార్దిక్ అరుదైన ఘనత.. రాజస్థాన్ చెత్త రికార్డ్.. తొలిసారి రివేంజ్
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.21 నిబంధనను అతిక్రమించినందుకు గాను నితీశ్ రాణా ఫీజులో 25 శాతం కోత విధించిన ఐపీఎల్ నిర్వాహకులు.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను హృతిక్ షోకీన్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి.. వీళ్లిద్దరు దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున ఆడుతూ సహచర ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. కానీ.. ఐపీఎల్‌లో మాత్రం వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఎక్కడ చెడిందో తెలీదు కానీ.. మైదానంలోనే గొడవకు దిగి, చెత్తగా ప్రవర్తించి.. క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వడంతో పాటు బీసీసీఐ విధించిన ఫైన్ రూపంలో మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది.
Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు
ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు గాను.. అతనికి రూ.12 లక్షల జరిమానా పడింది. ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. అతడి స్థానంలో సూర్య సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు అతనికి ఫైర్ విధించారు. అయితే.. కేకేఆర్ విధించిన టార్గెట్ (187) కాస్త పెద్దది కావడంతో.. లక్ష్య ఛేదనలో భాగంగా రోహిత్ శర్మ(20) ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దిగాడు.