ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శుక్రవారం ఈడెన్ గెర్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో23 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ నితీష్ రాణా మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 22 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
Nitish Rana – Knight in shining armor 💪#IPL2023 #TATAIPL #KKRvSRH | @KKRiders @NitishRana_27 pic.twitter.com/6VSKV3Y9Bc
— JioHotstar Reality (@HotstarReality) April 14, 2023
Read Also : Viral : హైట్ పెరగడానికి రూ. 1.35 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు.. చివరికి ఏం అయిందో తెలుసా..!
ముఖ్యంగా అయితే పవర్ ప్లేలో బౌలింగ్ వేసేందుకు వచ్చిన ఎస్ ఆర్ హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కు చుక్కలు చూపించాడు. 6వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో రాణా పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్ లో 6 బౌండరీలు కొట్టాడు. అందులో రెండు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ ఓవర్ లో ఏకంగా ఉమ్రాన్ మాలిక్ 28 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఓవర్ కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 41 బంతులు ఎదుర్కొన్న రాణా.. 5 ఫోర్లు.. 6 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు.. అద్బుతంగా ఆడిన నితీష్ 17 ఓవర్లో నటరాజన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.
Read Also : Today Business Headlines 15-04-23: ప్రయాణికుల సేవలో.. 170 ఏళ్లు. మరిన్ని వార్తలు
