New Zealand Scored 176 Runs In First T20 Against India: జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు 176 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (52), డేరిల్ మిచెల్ (59 నాటౌట్) అర్థశతకాలతో చెలరేగడంతో.. కివీస్ జట్టు ఆ స్కోరు చేయగలిగింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు కివీస్ రంగంలోకి దిగింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (35), డెవాన్ కాన్వే కలిసి తమ జట్టుకు శుభారంభమే అందించారు. ఇద్దరు భారీ షాట్లతో చెలరేగిపోయారు. అయితే.. ఇంతలోనే భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. వెనువెంటనే రెండు వికెట్లు తీశారు. అప్పుడు ఫిలిప్స్‌తో కలిసి కాన్వే కివీస్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. మూడో వికెట్‌కి వీళ్లిద్దరు కలిసి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
Kurnool Tragedy: మరో 20 రోజుల్లో పెళ్లి.. కానీ ఇంతలోనే..
అయితే.. ఫిలిప్స్ వికెట్ పడిన కాసేపటికే కాన్వే ఔట్ అవ్వడంతో, కివీస్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో డేరిల్ మిచెల్ తన కివీస్ జట్టుకి వెన్నెముకలా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. అవి పట్టించుకోకుండా తాను పరుగుల వర్షం కురిపించాడు. భారత బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్‌ల సహాయంతో 59 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. డేరిల్ పుణ్యమా అని చివర్లో కివీస్ స్కోరు పరుగులు పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. వాషింగ్టన్ సుందర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి, రెండు వికెట్లు తీశాడు. శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశాడు. ఈసారి అర్ష్‌దీప్ భారీ పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు.
Perni Nani: లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడు.. పేర్ని నాని ఫైర్