టీ20 ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషాన్ (4), కేఎల్ రాహుల్ (18) చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ (14), కోహ్లీ (9) కూడా వారినే అనుకరించారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (12), హార్డిక్ పాండ్యా (23), జడేజా (26 నాటౌట్) పరుగులు సాధించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో కేవలం 110/7 స్కోరు మాత్రమే భారత్ చేయగలిగింది. న్యూజిలాండ్ ముందు 111 పరుగుల టార్గెట్ నిలిచింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సోథీ 2 వికెట్లు తీయగా.. సౌథీ, మిల్నే చెరో వికెట్ సాధించారు.
Read Also: వామ్మో.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు మళ్లీ అతడే అంపైర్..!!
